zomato: తమిళనాడుకు చెందిన శ్రీమతి ఉమ జోమాటోలో డెలివరీ ఉద్యోగం నిర్వహిస్తుంది. ఈ మహిళ జోమాటోలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మహిళా ఉద్యోగినిపై కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదట. ఇంత వరకూ డెలివరీలు ఎప్పుడూ ఆలస్యం చేయలేదట. ఆమె నిజజీవితంలోకి తొంగి చూస్తే హృదయ విదారక ఘటనలు వెలుగు చూశాయి. 10 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయిన ఉమ తన కుమారుడితో కలిసి జీవిస్తోంది.
ఉమ ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేస్తోంది. తన ద్విచక్ర వాహనంపై కుమారుడిని ఎక్కించుకుని 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి క్రికెట్ కోచింగ్ సెంటర్‌కు తీసుకెళుతుంది. ఎందుకంటే ఆమె ఉండే ప్రాంతంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ అట. ఆ తర్వాత వంట చేసి, బట్టలు ఉతికి ఇంటి పనులు అన్నీ చేసుకున్న తర్వాత ఆమె జోమాటో(zomato)లో ఉద్యోగానికి సిద్ధమవుతుంది. ఆమె రాత్రి 11 గంటల వరకు డెలివరీలను సప్లయ్ చేస్తుందట. తన బైక్‌పై రోజూ 250 – 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం కొనసాగిస్తుంది. రోజుకు ఉమా కేవలం 5 గంటలు మాత్రమే నిద్రిస్తుందట. ఈ మహిళ పనిని మెచ్చుకున్న జోమాటో ఆమెను ఘనంగా సన్మానించింది. ఆమెకు డైమండ్ స్టార్‌ను ప్రదానం చేసింది. ఈమె రియల్ స్టోరీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ మహిళను గ్రేట్ ఉమెన్‌గా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి