Yuvatha song patammatho rambabu mp3 | పాటమ్మతో రాంబాబు తెలంగాణలో ఈతరం కళాకారుల్లో ఓ అద్భుతమైన మోటివేషనల్ సింగర్‌గా గుర్తింపు పొందారు. పాటమ్మతోనే..అంటూ చదువులపైన తన జీవితాన్ని పాట రూపంలో పాడి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల కళ్లల్లో కన్నీరు తెప్పించారు. ఒక దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన సింగర్ పాటమ్మతో రాంబాబు ఎన్నో పాటలను రాశారు. పాడారు. తాను పాడిన పాటలు ఎక్కువుగా యువతను ప్రోత్సహించేలా ఉండటంతో రాంబాబు ప్రతి పాట పబ్లిక్‌లోకి దూసుకెళ్లిపోతుంది.
కొన్ని వ్యక్తిగతంగా పాడిన పాటలు, మరికొన్ని రాజకీయంగా పాడిన పాటలు కూడా ఉన్నప్పటికీ ప్రతి పాట సూపర్ హిట్‌ను అందుకున్నాయి. తాను ఎక్కువుగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అణగారిన వర్గాల యువకులను ప్రోత్సహించడానికి తన పాట ఎంతో దోహద పడుతుందని చెప్పవచ్చు. జైభీమ్..జై స్వేరోస్ అంటూ ఎన్నో పాటలు పాడారు రాంబాబు. చదివిన ప్రతి ఒక్క యువకుడుని, చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని తన పాట ద్వారా ఆలోచింప చేసి ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపుతున్నారు.
ఎదుగుతున్న ఓ యువతరమా..! అంటూ పాటమ్మతో రాంబాబు పాడిన ఈ పాటను తన స్వహస్తాలతో రాశారు. పాడారు. ఈ పాట ఉద్దేశ్యం ఎక్కువుగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని, దేశానికి మంచి పాలన అందించాలని కొన్ని ఉదాహరణల ద్వారా రాంబాబు పాట రూపంలో తెలియజేశారు. ఈ పాట వింటుంటూనే రక్తం ఉరకలు పెడుతున్నట్టు, రోమాలు నిక్కరపొడిచినట్టు ఉంటుంది. నేటి రాజకీయాల్లో దుర్మార్గమైన పరిపాలనను తుదిముట్టించడానికి ఈ పాట వింటే అర్థమవుతుంది.
ఒక బుల్లెట్ చెయ్యలేని పనిని ఒక కలం చేస్తుందని, 100 స్పీచ్‌లు కదిలించనీ హృదయాలను ఒక పాట కదిలిస్తుందని, అందుకే ఈ సమాజాన్ని కదిలించాలంటే కలం , పాట అవసరమని ఇది రాంబాబు నిరూపిం చారని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ప్రతి యువతీ యువకులను ఆలోచింపజేసే టటువంటి పాట ముందున్న భవిష్యత్‌కు మనమే మంచి పునాది కావాలని కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జనాన్ని రెచ్చగొట్టిన కవులు కళాకారులు అందరి గొంతుకలు మూగబోయి గడీల బానిసలుగా మారాయి. ఇలాంటి సమయంలో మీలాంటి వారి ద్వారా అయినా జనాన్ని చైతన్య పరిచే ఇలాంటి పాటలు ఎన్నో రాయలని రాంబాబును మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
Yuvatha song patammatho rambabu mp3
Song Name: Eduguthunna o yuvatarama
Singer & Lyrics: Patammatho Rambabu
Music & Programming: Kalyan Keys
DOP & Editing: Ajay Kodem
Special Thanks to- B. Dhanunjay, K. Kiran Kumar Reddy, Kasturi Sree Charan
ఈ పాట వీడియో చూడాలంటే లింక్ క్లిక్ చేయండి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!