Yuddam Migile Unnadi: యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా! అనే సాంగ్ ఇప్పటికే ఎంతో మంది తీన్మార్ మల్లన్న అభిమానులను, తెలంగాణ సమాజాన్ని ఆలోచింప జేస్తుంది. ఒక సాధారణ జర్నలిస్టుగా ఉన్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.
నిరంతరం ప్రజల సమస్యలపై తన గళాన్ని తెలుపుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ,సామాన్యుడి సమస్యలను పరిష్కరిస్తూ గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రం రావడం అంటే అంత ఆషామాషీగా రాలేదు. ఎంతో మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను బలిచేసుకుని భవిష్యత్తు తరాల కోసం అమరవీరులయ్యారు. కానీ వచ్చిన తెలంగాణ వేరు..జరుగుతున్న పరిణామాలు వేరు.
తెలంగాణ సమాజంలో నీళ్లు, నిధులు, నియామకాల హామీ తుంగలో తొక్కివేయబడింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రూపంలో తెలంగాణ సమాజం మరో ఉద్యమానికి పూనుకునే రీతిలో యుద్ధం మిగిలే ఉన్నది!.. అంటూ ప్రజల మధ్యకు వచ్చారు. ఈ పాటను పాటమ్మతోనే ..రాంబాబు అన్న పాడిన తీరు చూస్తే రోమాలు నిక్కరపొడిచేలా ఉంది. ఈ పాట తెలంగాణ సమాజాన్ని ప్రస్తుతం ఆలోచింప జేస్తుంది.
Yuddam Migile Unnadi Song Lyrics in Telugu :
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
అమరవీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా!
తిరుగుబాటు గొంతై కదిలిండిరా మన తీన్మార్ మల్లన్న!
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
అమరవీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా!
తిరుగుబాటు గొంతై కదిలిండిరా మన తీన్మార్ మల్లన్న!
జర్నలిజం జెండెత్తుకుని ఇక కదులుతున్నవాడు!
అక్రమార్కుల గుండెలో బాణం ఎక్కు పెట్టినాడు!
సంబండ వర్గాల సమరశేఖరమై సాగుతున్నవాడు!
ఆ కోట్ల గొంతుల గోసను తెలిపిన గొంతుకైనాడు!
ఉద్యమాలతో పురుడుపోసుకున్న తెలంగాణలోనా!
ఉద్యమాలతో పురుడుపోసుకున్న తెలంగాణలోనా!
దగా పడ్డ ఈ బాంచన్ బ్రతుకుల భరోస మల్లన్న!
అరె..యుద్ధం..యుద్ధం..యుద్ధం..!
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
ప్రజల పక్షమై పేదల తరపున గళంమెత్తినాడు!
ఆ..ఎన్నాళ్లు ఈ కన్నీళ్లని కొట్లాడుతున్నవాడు!
అహ..నిప్పు కనికల్లే నిజాన్ని చాటే నిగ్గు తేల్చేటోడు!
కడు పేదల కష్టం తెలిసీ కనువిప్పై కదిలిండు!
అహ..పిడికిలెత్తి ఇక జాగో అంటూ జనం మధ్యలోనా!
పిడికిలెత్తి ఇక జాగో అంటూ జనం మధ్యలోనా!
అరె తెగించి కొట్లాడే నైజం మా తీన్మార్ మల్లన్న!
అరె..యుద్ధం..యుద్ధం..యుద్ధం..!
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
ప్రశ్నించే గొంతుకై ప్రజలను..ఇక మేలు గొలుపుతుండూ!
వేలాది గొంతుకుల సర్వమై సమస్య తెలుపుతున్న వాడు!
అహ ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు!
అహ బహుజన వాదం ఎత్తుకుని ఇక బయలుదేరినాడు!
మహనీయుల బాటలో నడుస్తూ చీకటి చీల్చివేయాలని!
మహనీయుల బాటలో నడుస్తూ చీకటి చీల్చివేయాలని!
రాజ్యాధికారమనే తొలిపొద్దు కళ్లారా చూడాలనీ!
అరె..యుద్ధం..యుద్ధం..యుద్ధం..!
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
అమరవీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా!
తిరుగుబాటు గొంతై కదిలిండిరా మన తీన్మార్ మల్లన్న!
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా!
సిద్ధం గమన్నది మన తెలంగాణలోనా!
అమరవీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా!
తిరుగుబాటు గొంతై కదిలిండిరా మన తీన్మార్ మల్లన్న!
తిరుగుబాటు గొంతై కదిలిండిరా మన తీన్మార్ మల్లన్న! ||2||
People also search for links
Yuddam Migile Unnadi song Download mp3 | Yuddam Migile Unnadi Song Ringtone Download | Yuddam Migile Unnadi Ringtone | Free Download Yuddam Migile Unnadi Song Ringtone | Yuddam Migile Unnadi Song | Download: Teenmaar Mallanna New Song 2020 | Yuddam Migile Vunnadi mp4 & mp3 Free download song | teenmaar mallanna song | యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా | యుద్ధం మిగిలే ఉన్నది | Q news teenmaar mallanna song.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి