YSRCP Rebal Mp నర్సాపురం వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామాకు దాదాపు సిద్ధమైనట్టే కనిపిస్తోంది.ప్రస్తుతం వారు ఉప ఎన్నిక గురించే మాట్లాడటానని చూస్తే ఇది నిజమవుతుందా? అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి. నరసాపురం నియోజకవర్గ ప్రజలు మరోసారి తనకు మద్దతుగా నిలవాలని ఉప ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోయేంతగా(YSRCP Rebal Mp) పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాలపై వ్యాఖ్యలు
క్షవరం అయిందన్న సంగతి ఓటర్లకు ఇన్నాళ్లకు తెలిసిందని, క్షవరం అయితే తప్ప వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని ఎంపి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పీఆర్సీ కొనసాగితే చాలని ఉద్యోగులు భావిస్తున్నారని వివరించారు. తనను స్పూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలని రఘురామ పిలుపునిచ్చారు.

నరసాపురంలో వెలిసిన ఫెక్సీలు
ఎంపీ రఘురామకృష్ణరాజు నరసాపురం వస్తున్నానని ఇంతకు ముందు ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అందులో ఒక వైపు రఘురామ, మరో వైపు పవన్ కళ్యాన్ ఉండటం గమనార్హం. పైగా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదం కూడా ఆ ఫ్లెక్సీలపై దర్శనమిస్తున్నాయి. ఇటీవల రఘురామ మాట్లాడుతూ తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పడం తెలిసిందే. మొత్తంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజీనామా పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!