YS Vivekanada Murder case

YS Vivekanada Murder case: వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఇద్ద‌రు ప్ర‌ముఖుల హ‌స్తం?

Share link

YS Vivekanada Murder case: పులివెందుల: ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్‌.వివేకానంద రెడ్డి మ‌ర్డ‌ర్ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు దీర్ఘ‌కాలికంగా విచార‌ణ‌లో భాగంగా గ‌త రెండు నెల‌లుగా అనుమానితులంద‌ర్నీ లోతుగా ద‌ర్యాప్తు చేస్త‌న్నారు. ఈ క్ర‌మంలో ప‌లు కీల‌క విష‌యాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వివేకా మ‌ర్డ‌ర్ కి సంబంధించి కీల‌క ఆధారాలు సేక‌రించిన‌ట్టు స‌మాచారం. ఈ కేసులో ప్ర‌ధానంగా ఆరుగురు వ్య‌క్తుల‌ను సీబీఐ ప‌దేప‌దే ప్ర‌శ్నించి కీల‌క వివ‌రాలు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

వివేకా అనుచ‌రుడు ఎర్ర‌గంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, పులివెందుల‌కి చెందిన కృష్ణ‌య్య కుటుంబం, వాచ్‌మెన్ రంగ‌న్న‌, ఇనాయ‌తుల్లాను సీబీఐ అధికారులు ప‌లుమార్లు విచారించారు. సీబీఐ విచార‌ణ‌లో వాచ్మెన్ రంగ‌న్న సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగ‌య్య స్టేట్మెంట్ రికార్డు చేసిన‌ట్టు స‌మాచారం. వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హ‌త్య చేసిన‌ట్టు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయ‌న హ‌త్య‌కు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చార‌ని, తొమ్మిది మందికి హ‌త్య‌ప్ర‌మేయం ఉన్న‌ట్టు రంగ‌న్న చెప్పాడ‌ని స‌మాచారం. హ‌త్య జ‌రిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్య‌క్తులు వ‌చ్చిన‌ట్టు స్టేట్మెంట్ పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

YS Vivekanada Murder case ఇద్ద‌రు ప్ర‌ముఖ‌ల హ‌స్తం కూడా ఉంద‌ని రంగ‌న్న చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ర‌హ‌స్యంగా వాచ్మెన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీబీఐ అధికారులు ఆ దిశ‌గా ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖులెవ‌ర‌న్న‌దీ స‌స్పెన్స్గా మారింది. త్వ‌ర‌లోనే ఈ కేసు కొలిక్కి వ‌స్తుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

Ayesha Meera case:ఆయేషా మీరా హ‌త్య కేసు లో సంచ‌ల‌నం- విజ‌య‌వాడ పోలీసుల‌కు నోటీసులు

Ayesha Meera caseఢిల్లీ: గ‌తంలో సంచ‌ల‌నం రేపిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని అయేషా మీరా హ‌త్య కేసులో స‌త్యంబాబు నిర్దోషిగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌న‌కు Read more

Gun Manufactures: ఇంట్లో తాపీగా తుపాకీలు త‌యారు చేస్తుంటే దొరికిపోయాడు

హ‌త్య కేసులో పోలీసులు విచార‌ణ‌తుపాకీల త‌యారీ గుట్టు ర‌ట్టుచెన్నైలో నేర్చుకున్న నిందితుడు Gun Manufactures: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌డిక‌ల‌పూడి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఇటీవ‌ల వీరంపాలె Read more

Ys Sunitha Reddy: వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు నివాసం వ‌ద్ద రెక్కీ…ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎస్పీకి ఫిర్యాదు

Ys Sunitha Reddy: క‌డ‌ప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో భాగంగా 68వ రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగించింది.క‌డ‌ప జిల్లా పులివెందుల ఆర్ అండ్ Read more

Letter: TDP కార్య‌క‌ర్త‌ల‌ సోద‌రుల హ‌త్య ఉదంతంపై నారా చంద్ర‌బాబు నాయుడు డీజీపికి లేఖ‌

Letter: క‌ర్నూలు జిల్లాలోని గ‌డివేముల మండ‌లం పెస‌ర‌వాయి గ్రామంలో 17 జూన్ 2021న ఉద‌యం 6.45 గంట‌ల‌కు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు దారుణంగా హ‌త్య చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. Read more

Leave a Comment

Your email address will not be published.