YS Vivekanada Murder case: పులివెందుల: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్.వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు దీర్ఘకాలికంగా విచారణలో భాగంగా గత రెండు నెలలుగా అనుమానితులందర్నీ లోతుగా దర్యాప్తు చేస్తన్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. వివేకా మర్డర్ కి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధానంగా ఆరుగురు వ్యక్తులను సీబీఐ పదేపదే ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
వివేకా అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్మెన్ రంగన్న, ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. సీబీఐ విచారణలో వాచ్మెన్ రంగన్న సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారని, తొమ్మిది మందికి హత్యప్రమేయం ఉన్నట్టు రంగన్న చెప్పాడని సమాచారం. హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్టు స్టేట్మెంట్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.
YS Vivekanada Murder case ఇద్దరు ప్రముఖల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పినట్టు తెలుస్తోంది. రహస్యంగా వాచ్మెన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నదీ సస్పెన్స్‌గా మారింది. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!