నేను ఈ గడ్డమీదే బతికి రుణం తీర్చుకుంటా
ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రకటన!
YS Sharmila Sankalpa Sabha : జులై 8న వైస్సార్ జయంతి రోజున పార్టీ పేరును ప్రకటిస్తా!
YS Sharmila Sankalpa Sabha : గత కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వైఎస్ షర్మిల. అనంతరం ఖమ్మంలో సంకల్ప సభ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కొన్ని అనివార్య కారణాల రిత్యా వైఎస్ షర్మిల ఖమ్మంలో సకల్ప సభకు అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తానికి భారీ జనసంద్రో నడుమ శుక్రవారం సంకల్ప సభ విజయంతంగా ముగిసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని తెలిసి కొందరు సీనియర్ రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు సైతం షర్మిలను ఇటీవల పలు సందర్భాల్లో కలిశారు.


అనంతరం ఖమ్మంలో జరిగిన వైఎస్ షర్మిల సంకల్ప సభకు భారీ స్పందన లభించినట్టైంది. వేల వాహనాలతో పెద్ద ఎత్తున అభిమానులతో ఆ సభ విజయవంతంమైందని చెప్పవచ్చు. అయితే పార్టీ పేరును ఈ సభలో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ కొత్త పార్టీ పేరును మాత్రం షర్మిల మరికొన్ని రోజులకు వాయిదా వేసినట్టయ్యింది. ఈ సభకు అటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు ఆంధ్రా రాష్ట్రం నుంచి సరిహద్దు జిల్లాల వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైఎస్ షర్మిల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని, బీజేపీ పార్టీ వెనుక నుండి షర్మిలను ప్రోత్సహిస్తుందని కొన్ని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, ఈ సభలో మాత్రం ఆ రెండు పార్టీలతో సహా పలు ప్రధాన పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ నాటి స్థితి గతులు, నేటి పరిస్థితులను పోల్చుతూ విమర్శలు చేశారు. సభ తొలుత జోహార్ వైఎస్సార్..జై తెలంగాణ అంటూ..ఉద్యమంలో అమరులైన వారికి వందనాలు చేస్తూ షర్మిల ప్రసంగం ప్రారంభించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో తాను ఎవరు వదిలి బాణాన్ని కాదని తేల్చి చెప్పారు. 108 అంబులెన్స్ ఆలోచనను వైఎస్ తప్ప ఏ నాయకుడూ చేయలేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని, అదే విధంగా పాలన సాగిందని తెలిపారు. ప్రైవేటు రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ కలలు కన్నారని పేర్కొన్నారు.


ఇప్పుడున్న నాయకుడు ఏ ఒక్కడైనా అలా అన్నారా అని ప్రశ్నించారు. నీళ్లన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పోతున్నాయని, నిధులు కూడా వారి కుటుంబానికే చెందుతున్నాయని విమర్శించారు. ఆత్మగౌరవం దొర చెప్పు కింద పడి నలిగిపోతుందుని వారికి ఓటేస్తేనే జీతాలు పెంచుతామని టీచర్లను బెదిరించారని సంచలన ఆరోపణలు ఏశారు. కేసీఆర్ అడుగు పెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశారని, సచివాలయంలో అడుగు పెట్టని ఇలాంటి సీఎం దేశంలో ఎవరూ లేరని సభలో విమర్శించారు. యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదని , కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగిన ప్రతి ఒక్కరికీ నాడు వైస్ తెల్లరేషన్ కార్డు ఇచ్చారని అన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు ఇప్పుడు ఆ మాట ఏమైందని? కేసీఆర్‌ను ప్రశ్నించారు.
సింగరేణి కార్మికుల మైనింగ్ సమస్య అలాగే ఉందని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని, రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని హెద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని సీఎం సారూ? కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉందని, 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? అని ప్రశ్నించారు.


తాను ఈ గడ్డమీదే బతికా.. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా? రాజన్న సంక్షేమ పాలనను తిరిగి తీసుకొచ్చే ఉద్ధేశంతోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని తెలిపారు. జులై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి రోజున పార్టీ పేరును ప్రకటిస్తానని ప్రసంగం ముగించారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court