YS Sharmila Political News : నాన్న అధికారులే కొత్త పార్టీ సలహాదారులు!
YS Sharmila Political News : Hyderabad: వైఎస్ షర్మిల కొత్త పార్టీకి సలహాదారులుగా ప్రభాకర్ రెడ్డి, ఉదయ సిన్హా నియామకయ్యారు. పార్టీ నిర్మాణంలో క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఉంటున్న వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పలు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆమెను కలిసి మద్దతు తెలిపారు. మరోవైపు పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసిన్హాలను నియమించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి, ,సీఎస్ఓగా ఉదయ సిన్హా పనిచేశారు.
మరోవైపు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిల పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. కొన్ని గంటల్లో షర్మిలతో బ్రదర్ షఫీ భేటీ కాబోతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను తన ఉత్తేజ పూరిత ప్రసంగాలతో ఆయన మోటివేట్ చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.
తెలంగాణ కోడలిగా..!
తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. తెలంగాణలో ఆంధ్రావాళ్ల పార్టీలు ఎందుకని పలువురు నేతలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం ఎందుకని అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల తాను ‘తెలంగాణ కోడలు’ అని ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇంటి కోడలిగా తాను తెలంగాణకే చెందుతానని చెబుతూ ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నట్టు సమాచారం.
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
ఇది చదవండి: కేసీఆర్ ఒక విలన్: భట్టి విక్రమార్క
ఇది చదవండి:తమిళ స్మగ్లర్ అరెస్టు
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!
ఇది చదవండి:మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు
ఇది చదవండి:ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను
ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!