YS Sharmila new political party | పార్టీ పెట్టడం పక్కా! కనిపించని జగన్ ఫొటో!Hyderabad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక సోదరి షర్మిల ఇటీవల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టు అయ్యింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్లోని షర్మిల నివాసంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వేదికైంది. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు చాలా కాలం తర్వాత ఈ రోజు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురింపించారు. బాణా సంచా పేల్చారు. డ్యాన్సులతో సందడి చేశారు.
ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం ఉన్న నేతలందరికీ షర్మిలా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల ఉంటున్న నివాస ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా సీఎం జగన్ ఫొటో లేకుండా షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేయడంతో తెలంగాణలో కొత్త పార్టీ కచ్చితంగా పెడతారనే వాస్తవం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహానాగాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై షర్మిల ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో తొలుత నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు.
త్వరలో రాజన్న రాజ్యం తెస్తా : షర్మిల
YS Sharmila new political partyముఖ్యనేతలతో సమావేశం అనంతరం షర్మిల మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైస్సార్ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడాను. మిగిలిన జిల్లాల నేతలతో మాట్లాడతాను. క్షేత స్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్నాను. అందరి నేతలతో చర్చించిన తర్వాత త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తాను. అని షర్మిల మాట్లాడారు.
ఇది చదవండి:నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?