Young woman brutally murdered | అత్యంత దారుణంగా యువ‌తిని హ‌త్య చేసిన ప్రేమోన్మాది

Young woman brutally murdered

Chittoor: ఓ యువ‌తిని ప్రేమ పేరుతో వేధించి అత్యంత దారుణంగా హ‌త్య‌చేశాడు ఓ ప్రేమోన్మాది. అంతేకాకుండా యువ‌తిని గొంతుకోసి ప‌రార‌య్యాడు. యువ‌తి మృతితో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న కుటుంబ స‌భ్యులు యువ‌కుని ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం పెనుమూరు మండ‌లం తూర్పుప‌ల్లి గ్రామానికి చెందిన ష‌ణ్ముగ‌రెడ్డి, రాజేశ్వ‌రిల‌కు గాయ‌త్రి(19), శావ్ర‌ణి(15), ర‌క్షిత‌(13) అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తెఅయిన గాయ‌త్రి చిత్తూరు లో విజ‌యం కాలేజీలో డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌ది.

మంగ‌ళ‌వారం గాయ‌త్రి త‌న మేన‌మామ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కూతురు ర‌మ్య‌తో పెనుమూరు వెళ్లి వ‌స్తుండ‌గా రాజా ఇండ్లు వ‌ద్ద‌, పూత‌ల‌ప‌ట్టు మండ‌లం చింత‌మాకుల‌ప‌ల్లి గ్రామానికి చెందిన న‌క్క‌ల సుబ్బ‌య్య , ఇత‌నికి ఇద్ద‌రు భార్య‌లు మొద‌టి భార్య 20 సంవ‌త్స‌రాల క్రితం వ‌దిలేసింది. ఆమెకు లోకేష్ చ‌ర‌ణ్ ఉండ‌గ, రెండో భార్య ల‌క్ష్మి అనే ఆమెకు నిందితుడు ఢిల్లీ బాబు(19) ఉన్నాడు. అయితే గాయ‌త్రి వ‌స్తుండ‌గా కాపు కాసి రెండు క‌త్తుల‌తో ఒక‌దానితో గొంతుకోసి మరొక‌దానితో క‌డుపులో పొడుస్తుండ‌గా జ‌నం వెంట‌ప‌డ‌టంతో అక్క‌డి నుండి ప‌రార‌య్యాడు.

 

Young woman brutally murdered

స‌మాచారం మేర‌కు ఈ ఢిల్లీబాబుపై గ‌తంలోనే పోలీస్టేష‌న్ల‌లో 10 కేసులు కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది. గ‌త రెండు నెల‌ల క్రితం ఢిల్లీబాబు,గాయ‌త్రి ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్ద‌రూ మైన‌ర్లు కావ‌డంతో పెనుమూరు పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేసి వారివురి త‌ల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే ఢిల్లీబాబు క‌క్ష పెంచుకొని గాయ‌త్రిపై దాడికి తెగ‌బ‌డ్డాడు. బాధితురాలు సీఎంసి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయ‌త్రి మ‌ర‌ణంతో ఒక్క‌సారా ఆగ్ర‌హానికి గురైన కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రులు ఢిల్లీబాబు ఇంటిపైకి వెళ్లి దాడి చేసి ధ్వంసం చేశారు.

ఇది చ‌ద‌వండి: తిట్ల మీద ఉన్న ప‌ట్టు శాఖ‌పై లేదు: అచ్చె‌న్నాయుడు

ఇది చ‌ద‌వండి: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *