Doctor Couple : కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ దంపతులను ఓ ఇద్దరు యువకులు అడ్డగించి తుపాకీతో కాల్పిన సంఘటన రాజస్థాన్లో సంచలనం సృష్టిస్తోంది. కాల్పుల్లో డాక్టర్ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా నిందితుడి సోదరి హత్య కేసుకు డాక్టర్ దంపతులకు సంబంధం ఉండటంతోనే కాల్పులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.
Doctor Couple : పట్టపగలు, నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఓ యువకుడు గన్తో కారులో ఉన్న డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన రాజస్థాన్లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది. కాల్పులకు సంబం ధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. డాక్టర్ దంపతులు ఓ కారులో వెళ్తుండగా దాని వెనకాలే బైకుపై ఇద్దరు యువకులు వచ్చారు. నడిరోడ్డుపైనే కారు ముందు ద్విచక్రవా హనాన్ని నిలిపారు. దీంతో కారును నిలిపివేసిన డాక్టర్ వారిని చూసి కారు అద్దాలు తెరిచాడు. ఆ వెంటనే ఓ యువకుడు బైకు దిగి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపాడు. ఆ సమ యంలో మరో యువకుడు బైకుపైనే కూర్చున్నాడు. కాల్పులు జరిపిన యువకుడు ఆ వెంటనే బైకు ఎక్కగాడు, మరో యువకుడు బైకును నడిపాడు. అనంతరం గాల్లోకి తుపాకీ చూపిస్తూ అక్కడ నుంచి పారిపోయారు.
కక్షతోనే కాల్పులు!

ఇదిలా ఉండగా రెండేళ్లుగా విచారణ జరుగుతోన్న ఓ యువతి హత్య కేసులో డాక్టర్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే రెండేళ్ల క్రితం హత్యకు గురైన యువతి సోదరుడే డాక్టర్ దంపతులపై కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. డాక్టర్ తో గతంలో ఆ యువతికి సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆయన తల్లి కూడా నిందితులుగా ఉన్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి