Harassment by Financiers

Harassment by Financiers : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటుచేసుకున్న ఘ‌ట‌న

Harassment by Financiers : Ravulapalem : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గం రావుల‌పాలెం సెంట‌ర్‌లోని చోటు చేసుకుంది. ఒక ఫైనాన్స్ దుకాణం ఎదుట ఓ యువ‌కుడు మృతి చెంది ఉండ‌టంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

సిఐ వి.కృష్ణ‌, ఎస్సై పి.బుజ్జిబాబు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. మృతుడు కొత్త‌పేట మండ‌లం మోడేకుర్రుకు చెందిన చింత‌ప‌ల్లి రాఘ‌వేంద్ర (28) గా గుర్తించారు. మృత‌దేహం వ‌ద్ద సూసైడ్ నోటు స్వాధీనం చేసుకు న్నారు పోలీసులు. రాఘ‌వేంద్ర గుంటూరులోని ఫైనాన్షియ‌ర్ల వ‌ద్ద అప్పు తీసుకొని జేసీబీ వాహ‌నాన్ని కొన్నాడు. అక్క‌డే ప‌నులు చేస్తున్నాడు. అయితే గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో ప‌నులు లేక వాయిదాలు చెల్లించ‌లేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్య‌క్తులు బంధించి వేధింపుల‌కు గురిచేశార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఇటీవ‌ల వేధింపులు తీవ్రం కావ‌డంతో మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై బుజ్జిబాబు తెలిపారు.

యువ‌కుడి మృత‌దేహాన్ని ప‌రిశీలిస్తున్న పోలీసు అధికారులు
Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *