Young Female Suicideచిత్తూరు: ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు కటిక దారిద్య్రం..చెల్లెలు అనారోగ్యం..భారీ వర్షాలకు ఇళ్లు ఉరుస్తుండటంతో మొన్ననే దాతలు ఇచ్చిన ఇంటిలో కాపురం, తన కోసం తల్లిదండ్రుల కష్టాలు చూడలేక ఏమనుకుందో ఏమో కానీ ఆ చదువులమ్మ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన గుడుపల్లిలో (Young Female Suicide)చోటు చేసుకుంది.


జానకిరామ్, నాగలక్ష్మి లకు ఇద్దరు కుమార్తెలు. అయితే పెద్ద కుమార్తె ప్రియ(24), మరో కుమార్తె ఝాన్సీ. ప్రియ కార్వేటినగరంలోని TTC Course చేసి DSC లో క్వాలిఫై అయ్యింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఈ లోపు RRB రాసి ఒక్క Mark లో పోయింది. ఇదిలా ఉండగా, Open Universityలో డిగ్రీ పూర్తి చేసి సచివాలయంలో అయినా ఉద్యోగం రాకపోదా.. అనే గంపెడాశతో ఆదివారం తిరుపతిలో ప్రాక్టికల్ పరీక్ష రాసి గుడుపల్లకి చేరుకుంది. అయితే సోమవారం రాత్రి ఏమైందో ఏమో తెలియదు గానీ రైలు కింద పడి తనవు చాలించింది. ఈ మేరకు కుప్పం రైల్వే ఎస్సై కె.బలరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి రోదన అంతా ఇంతా కాదు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!