Road Accident : గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు నవ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో విషాదం రేపింది. కరోనాను జయించిన ఆ దంపతులు ఇలా మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.
Road Accident : ఆ నవ దంపతులు కరోనా మహమ్మారిని జయించారు. అయినప్పటికీ విధి కన్నెర్ర జేసింది. గుర్తు తెలియని వాహనం రూపంలో వారిని బలితీసుకుంది. పెళ్లైన ఆర్నెళ్లకే ఆ నవ దంపతులకు నూరేళ్లు నిండాయి. గర్భిణీ అయిన భార్యను కష్టం లేకుండా చూసుకోవాలన్నా అతని తపన, పండంటి బిడ్డను కని భర్తకు కానుకగా ఇవ్వాలన్న ఆమె కోరికలను విధి చిదిమేసింది. విజయనగరం జిల్లా పూపసాటిరేట మండలంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చిట్టివలసకు చెందిన రౌతు యోగేశ్వరరావు(27), రోహిణి(22) దంపతులు సోమవారం బైక్పై విశాఖపట్నం వెళ్లుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రైల్వేలో కళాసీగా పనిచేసే యోగేశ్వరరావు నిత్యం రైల్లోనే ఇంటి నుంచి పనికి వెళ్లొచ్చేవారు. అయితే రోజూ అంతదూరం రాకపోకలు సాగించడం కష్టంగా మారడంతో రెండు నెలల క్రితమే కంచరపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో అక్కడ కాపురం పెట్టాడు.
నరసన్నపేటకు చెందిన రోహిణిది ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. యోగేశ్వరరావు తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందడంతో ఇద్దరూ నాన్న ప్రేమకు దూరమయ్యారు. పెళ్లయ్యాక దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో కరోనా సోకడంతో ఇద్దరూ ఇంట్లోనే ఉండి క్రమం తప్పకుండా మందులు వాడి కోలుకున్నారు. భార్య రోహిణి నీరసంగా ఉందని చెప్పడంతో చిట్టివలస లో తల్లి వద్ద ఉంచాడు. రెండ్రోజుల క్రితమే భార్య గర్భిణి అని తెలిసి యోగేశ్వరరావు చాలా సంతోషించాడు. దగ్గరుండి బాగా చూసుకోవాలన్న ఉద్ధేశ్యంతో విశాఖపట్నం తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజులు అక్కడే ఉంచి ఆసుపత్రిలో చూపించి, వారంలో తిరిగి వస్తానమ్మా! అంటూ తల్లికి చెప్పి భార్యతో కలిసి, బైక్పై విశాఖపట్నం బయలుదేరారు.
కనిమెట్ట పైవంతెన వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అదుపుతప్పి బైక్ డివైడర్ను బైక్ బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రగాయాలతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పూపాటిరేగ పోలీసులు తెలిపారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!