Yogi Vemana: దిగంబ‌రి వేమ‌నకు పిచ్చిప‌ట్టింద‌న్నారు!

Yogi Vemana: తాను జీవించిన కాలం ప‌రిధిలోనైనా సామాజిక చైత‌న్య దృష్టితో క‌విత్వం చెప్పిన మ‌న తొలి తెలుగు క‌వి వేమ‌న్న‌. 17వ శతాబ్ధం సామాజిక ప‌రిస్థితుల‌ను ఎలా ఉన్నాయో, ఎలా అర్థం చేసుకున్నాడో మ‌నం చెప్ప‌లేము కానీ, గొప్ప‌, పేద తార‌త‌మ్యాలు అర్థం చేసుకోగ‌లిగాడ‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు. అలాంటి గొప్ప క‌వి వేమ‌న గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం!.

Yogi Vemana: వేమ‌న గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

యోగి వేమ‌న త‌న క‌విత్వం ద్వారా, శైవ‌, వైష్ణ‌వ మ‌తాల వారి ఆర్భాటాల‌ను, వారి దురాచాల‌ను, మోసాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు.చిలుక‌ప‌లుకుల చ‌దువుల‌ను బ‌హిరంగా విమ‌ర్శించాడు. కాకుల‌కు పిండాలు పెట్ట‌డం ఏమిటి? అది వ‌ట్టి మూర్ఖ ఆచారం అంటూ తీవ్రంగా ఖండించాడు. శ్ర‌మశ‌క్తిలోనే స్వ‌ర‌మూ ఉన్న‌ది అనేంత నిశిత ప‌రిశీల‌న చెయ్య‌గ‌లిగిన వేమ‌న మామూలు క‌వి కాదండోయ్‌!. త‌న కాల‌పు చ‌ట్రంలో ఇమ‌డ‌లేని గొప్ప క‌వి.

Yogi Vemana 17వ శాతాబ్ధంలో రాయ‌ల‌సీమ‌ (క‌డ‌ప జిల్లా)లో ఒకానొక ప‌ల్లెలో ఒకానొక మోతుబ‌రి రైతు కుటుంబంలో పుట్టాడు. అత‌ని జ‌న్మ‌స్థ‌లం గురించి గాని, త‌ల్లిదండ్రుల గురించి గాని తెలుసుకునేంత ఆధారాల్లేవు. జ‌న‌న సంవ‌త్స‌రం తెలియ‌క‌పోయినా ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 18వ తేదీన జ‌యంతిని జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగాయ జ‌రుగుతున్న‌ది. చిన్న‌త‌నంలో వేమ గారాభంగా, అల్ల‌రి చిల్ల‌రిగా పెరిగాడు. గ్రామంలో భూస్వామ్య కుటుంబం కాబ‌ట్టి కొంత పొగ‌రు, మాట సాగిన‌వాడూ, మాట‌కారీ కాబ‌ట్టి స్నేహితులంద‌రికీ నాయ‌కుడు.

స్థిరంగా నిలువ‌ని స్వ‌భావం

అగ్ర‌, నిమ్న కులాల్లో అన్ని ర‌కాల స్నేహితుల‌తో తిరిగేవాడు. ఒక‌చోట కాలు నిలువ‌ని అస్థిర స్వ‌భావం వేమ‌న‌ది. పొలం బాధ్య‌త‌లు అత‌నికి వంట‌బ‌ట్ట‌లేదు. ఊరి దేవాల‌యాల్లో అయ్య‌వార్లు చెప్పే ఆధ్యాత్మిక విష‌యాలు, హ‌రిక‌థ‌లు, తోలుబొమ్మ‌లాట‌లు మొద‌లైన‌వి వేమ‌న‌కు పురాణ ప‌రిచ‌యాన్ని క‌లిగించాయి. అన్ని మ‌తాల‌వారితో అంటుకొని తిర‌గ‌డం వ‌ల్ల వేమ‌న‌కు ఆయా మతాల‌తో ప‌రిచ‌యం క‌లిగింది.

అలాంటి వేమ‌న‌ (Yogi Vemana) కు యుక్త వ‌య‌సు వ‌చ్చింది. ఆనాటి మ‌త సంస్థ‌ల్లో పేరుకొని పోయిన అవినీతి, దేవ‌దాసి, బ‌సివి సంప్ర‌దాయం, పెచ్చు పెరిగిన వ్య‌భిచారం, ఇవ‌న్నీ వేమ‌న‌మీద ప్ర‌భావం చూపాయి. వేమ‌న బాధ్య‌తార‌హితంగా తిర‌గ‌డం వ‌ల్ల చెడు అల‌వాట్ల‌కు లోనై అప్పులు పాల‌య్యాడు. ఊరు నిండా అప్పులు చేశాడు. అప్పుల‌వాల్లు దార్లుకాస్తున్నారు. ర‌స‌వాదుల‌తో చేరి బంగారం చేసే విద్య‌ను నేర్చుకుందామ నుకున్నాడు. ఎవ‌రికీ చెప్ప‌కుండా వేమ‌న ఊరు విడిచి దేశం మీద ప‌డ్డాడు. దేశ దిమ్మ‌రిగా ఊరూరు సంచారం చేశాడు. కాని ఉన్న ఊరు విడిచివానికి వేరే చోట బ‌లం లేద‌ని త్వ‌ర‌గా తెలుసుకున్నాడు.

ఎగ‌తాళి చేశారు!

మ‌ర‌లా ఊళ్లోకొచ్చాడు. కుటుంబ స‌భ్యులు అస‌హ్యించుకున్నారు. ఊళ్లో వాళ్లంద‌రూ ఎగ‌తాళి చేశారు. అంద‌రూ త‌న‌లోనే త‌ప్పులెన్నుతున్నారు. వారికి త‌న‌ను వేలెత్తి చూపే నైతిక బ‌లం లేద‌నే గుర్తింపు అత‌నికి క‌లిగింది. వారి పూర్వ జీవితాల‌ను చెడ‌ప‌డ తిట్టాడు. మాసిన బ‌ట్ట‌ల‌తో పెరిగిన గెడ్డంతో ఉన్న అత‌న్ని లోకులు పిచ్చివానిగా జ‌మ క‌ట్టారు. వేమ‌న‌కు ఈ ప్ర‌పంచ మీద విర‌క్తి పుట్టింది. శాంతి క‌రువైంది. నీడ పోయింది. అడ‌వుల‌లో, కొండ గుహ‌ల‌లో శాంతికి మార్గం చూపేవారి కోసం వెతికాడు. దేశ సంచారంలో అత‌డికి అన్యాయాలు బాగా అర్థ‌మ‌య్యాయి. లౌక‌లి స్పృహ‌ను విస్మ‌రించి వైరాగ్యంతో దిగంబ‌రాన్ని ధ‌రించాడు.

ఎవ‌రు విన్నా, ఎవ‌రు విన‌కున్నా, జ్ఞాన‌మార్గాన్ని ఉప‌దేశించి దేశ‌మంతా తిరిగి రొష్టున‌ప‌డ్డాడు. ఉద్రేక‌ప‌డ్డాడు, ఇవ‌న్నీ అన్వేషించి ఎక్క‌డో వేమ‌న త‌నువు చాలించాడు. వేమ‌న ర‌చ‌న‌లో ప్ర‌జ‌ల భాష‌లో ప్ర‌చారంగా ఉన్న ప‌దాల‌నూ, మాండ‌లికాల‌ను ప్ర‌యోగించి ప్ర‌జ‌ల‌కు స‌న్నిహిత‌మైన ర‌చ‌న చెయ్య‌డం, చెప్ప‌ద‌ల‌చుకున్న భావాన్ని త‌గిన విస్తీర్ణంలోనే క్లుప‌తంగా చెప్ప‌డం అత‌ని గొప్ప ల‌క్ష‌ణం. వేమ‌న ప‌ద్యాల‌లో ప్ర‌సిద్ధ‌మైన ఆట‌వెల‌దు..ల‌తో ఈనాటి ప‌రిస్థితుల‌లోనూ పూర్తిగా కాల‌దోషం ప‌ట్ట‌లేదు.

ఈ కాలానికి Yogi Vemana ప‌ద్యాల‌ను అన్వ‌యించుకొని వాడుకునే అభిరుచి కావాలి. వేమ‌న ప్ర‌ధానంగా తాత్వికుడైన క‌వి. సామాజిక దృష్టి ప్ర‌ధానంగా ఉన్న ప‌దునైన ప‌రిశీల‌న ఉన్న క‌వి కావ‌డం వ‌ల్ల స‌మ‌కాలికులెవ‌రూ చూడ‌నంత లోతుగా సంఘాన్ని ప‌రిశీలించాడు.

Share link

Leave a Comment