Yobu Prabhas: యూట్యూబ్‌లో తనదైన శైలిలో వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ అందర్నీ నవ్విస్తున్న యోబు ప్రభాస్ అనే తెలుగు కుర్రాడు ఇప్పుడు రోజుకో కొత్త వీడియోలతో ముందుకు వస్తున్నారు. yobu prabhas youtub channel పెట్టి మంచి మంచి క్రేజీ సినిమాల్లో వీడియోలను ఎడిట్ చేస్తూ అందులో తాను నటిస్తూ viewers ను నవ్విస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. just for fun యాష్ ట్యాగ్‌తో ప్రతి వీడియోలో నటిస్తూ కొత్తగా ఆలోచిస్తున్నాడు.
Pushpa Kiss secene, Samantha colgate Ad funny edit, Bahubali, Samantha, Rashmika, Ganesh Master steps, Radhe shyam traine scene, geetha govindam, Arjun Reddy ఇలా ప్రతి సినిమా వీడియోను ఎడిట్ చేసి అందులో ఫన్నీగా నటించాడు యోబు ప్రభాస్(Yobu Prabhas). అదే విధంగా తాను Kinemaster Appలో మాత్రమే ఎడిట్ చేస్తూ అద్భుతమైన వీడియోలు తయారు చేస్తున్నాడు. ఈ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలో కూడా వీడియో రూపంలో అందరికీ తెలిసేలా వివరిస్తున్నాడు. కేవలం ఫన్నీ కోసమే చేసే ఈ వీడియోలను ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తున్నారు.
యోబు ప్రభాస్ నటించే వీడియోలు అన్నీ తాను స్వయంగా ఎడిటింగ్ స్కిల్స్‌తోనే తయారు చేసినవే. మొదటిగా ఒక వీడియోను ఎంచుకొని దానిలో హీరో క్యారెక్టర్‌ను కైన్ మాస్టర్ యాప్‌లో రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత తాను గ్రీన్ స్క్రీన్(green screen) మీద ఒక్కటిగా యాక్టింగ్ చేస్తాడు. వీడియోలో ఎడిటింగ్ టూల్స్‌లో గ్రీన్ స్రీన్ రిమూవ్ చేసి సినిమా వీడియో ఎడిటింగ్‌లో తన క్యారెక్టర్‌ను సెట్ చేస్తారు. అలా సెట్ చేసి బ్యాగ్రౌండ్ ఫన్నీ మ్యూజింగ్, వాయిస్ యాడ్ చేస్తారు. యోబు నటించిన ఏ వీడియో అయినా డిఫరెంట్ ఫన్నీగా ఉంటుంది.


యోబు ప్రభాస్ నటించే వీడియోలు నిడివి కేవలం 1 నిమిషం లోపు మాత్రమే ఉంటాయి. తన ఛానెల్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 50 వీడియోలు తీశారు. ఇప్పటి వరకూ తన ఛానెల్ కు 55 వేలకు పైగా సబ్ స్క్రైబర్‌లతో దూసుకుపోతున్నాడు. తన ఫాలోవర్స్‌కు నచ్చేలా మెచ్చేలా ఫన్నీ వీడియోస్ తయారు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నాడు. ఇలాంటి వీడియోలతో మరింత సక్సెస్ ఫుల్ జర్నీ చేయాలని ఆశిస్తూ సపోర్టు చెద్దాం!