Yendluri Sudhakar హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. నిజామాబాద్ జిల్లా పాముల బస్తీలో 1959 సంవత్సరం జనవరి 21న ఎండ్లూరి సుధాకర్(Yendluri Sudhakar) జన్మించారు. ప్రముఖ రచయిత్రి కవి స్వర్గీయ డా.పుట్ల హేమలత వీరి భార్య. వీరికి ఇద్దరు కుమార్తెలు మానస, మనోజ్ఞ కలరు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠంలో 28 సంవత్సరాలు పని చేశారు.
సుమారు 100 మందికి పైగా విద్యార్థులకు గైడ్‌గా వ్యహరించారు సుధాకర్. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు యూనివర్శిటీ కౌన్సిల్ సభ్యులు, తెలుగు సలహా మండలి సభ్యులు, తెలుగు అకాడమీ సభ్యులు, ప్రసిద్ధ హిందూ, ఉర్దూ పద్యాల, పలు లఘు చిత్రాల అనువాదకుడుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ రోజు మృతి చెందారు.

ఎండ్లూరి సుధాకర్ రచనలు, పుస్తకాలు
- వర్తమానం (1992-95)
- జాషువా నా కథ (1992)
- కొత్త గబ్బిలం (1998-2011)
- నా అక్షరమే నా ఆయుధం (1999)
- మల్లె మొగ్గల గొడుగు (మాదిగ కథలు) (1999)
- నల్లద్రాక్ష పందిరి (2002)
- పుష్కర కవితలు (2003)
- వర్గీకరణీయం (2004-2005)
- ఆటా జనికాంచె (2006)
- జాషువా సాహిత్యం – దృక్ఫథం – పరిణామం (2007)
- గోసంగి (2011)
- కథానాయకుడు జాషువా (2012)
- నవయుగ కవి చక్రవర్తి (2012)
- కావ్యత్రయం
- సాహితీ సుధ (2016)
- తెలివెన్నెల (2017)
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ