Ye Kommaki Ye Puvvo : నువ్వు సమస్యలో ఉన్నావా?…నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదా?..ఒంటరిగా క్రుంగిపోతున్నావా?..ఇక చావే సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావా?…అయితే ఒక్కసారి Charan Arjun అన్న పాటల్లో ఒకటి విను. కచ్చితంగా ఉపశమనం పొందుతావు. భారం పోతుంది. జీవితంపై ఆశ పుడుతుంది. సమస్యలను ఎదుర్కొన కలిగే బలం పుట్టుకొస్తుంది.
అవును..నేను వాస్తవమే చెప్పాను. ఎందరో మోటివేషనల్ అయి చరణ్ అన్న పాటలతో జీవితాన్ని నిలబెట్టుకున్నారు. మంచి మార్గంలో బ్రతుకుతున్నారు. GMC Television Channel నుండి ప్రతి పాటను ఒక సందేశాత్మకంగా విడుదల చేసి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న భారాన్ని పాట రూపంలో తీసివేస్తున్న చరణ్ అర్జున్ అన్న ప్రస్తుతం యువకులకు ఒక మోటివేషనల్ గాడ్‌గా కనిపిస్తున్నాడు. తాను పాడిన ప్రతి పాట ఆలోచింపజేసే విధంగానే ఉంటుంది.
తన పాటల కోసం నిత్యం యూట్యూబ్‌లో సెర్చ్ చేసే వారు తెలుగు వారిలో చాలా మంది ఉన్నారు. పాట ఆనందం కోసమో, ఆహ్లాదం కోసమో కాకుండా ప్రాణాన్ని నిలబెట్టే విధంగా ఉండాలనే ఆలోచనతో చరణ్ అర్జున్ ప్రతి పాట రాస్తారని వారి పాటలు విన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తన పాటల ద్వారా క్షణికావేశంలో ప్రాణాలు సైతం తీసుకునే వారు ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య ఆలోచన నుండి బయటకు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మీ పాటతోనే ఇప్పుడు నేను మళ్లీ జీవిస్తున్నాను అన్నా అని కామెంట్లు పెట్టే వారిని మీరు పరిశీలించవచ్చు.
ప్రతి పాటలో చరణ్ అర్జున్ అన్న రాసిన Lyrics అర్థం చేసుకుంటే ఎంతో అనుభవాన్ని చవిచూసిన సంఘటనలు మన కళ్లకు ఎదురుగా కనిపిస్తుంటాయి. ఓటమి వచ్చినప్పుడు క్రుంగి పోకుండా గెలుపు వచ్చినప్పుడు విర్రవీగకుండా జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో చరణ్ అర్జున్ పాటల ద్వారా తెలుసుకోవచ్చు. కరోనాతో కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు, రక్త సంబంధీకులను కోల్పోయిన వారికి తన పాటలు మళ్లీ వెలుగు నింపాయి. పడి లేస్తూ జీవితాన్ని ఎలా గెలవాలో తెలియజేస్తాడు అర్జున్ అన్న.
Ye Kommaki Ye Puvvo – ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో
ఇక ఇప్పుడు చెప్పబోయే పాట ప్రతి ఒక్కరికీ అవసరమే. ఎందుకంటే మనలో ఎవరో ఒకరం ఒంటరిగా ఫీలై జీవితాన్ని ముగించుకుందామనుకున్న సందర్భాలు, ఆలోచనలు వచ్చే ఉంటాయి. అలాంటి వారికి ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో ఏ చెట్టుకు ఏ కాయ కాయలో ఏ గువ్వలు ఏ గూడు చేరాలో అన్ని ముందుగానే రాసే ఉంటాడు ఆ పైవాడు అన్న ఈ పాట మళ్లీ జీవితాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. ఈ పాటకు లిరిక్స్, సంగీతం, సింగింగ్ అన్నీ చరణ్ అర్జున్ చేశారు. ఒక షార్ట్ స్టోరీని రన్ చేస్తూ మధ్యలో మోటివేషనల్ సాంగ్ వస్తుంది. ఇందులో ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడును ఎలా కాపాడారో చూడవచ్చు.
ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో ఈ పాటను ఇప్పటికీ ఎంతో మంది వింటున్నారు. ఎంతో మంది Motivation అవుతున్నారు. ఈ పాట విన్నవారంతా నా జీవితాన్ని కావాల్సిన పాట ఇచ్చారని అర్జున్ అన్నను ప్రశసిస్తు న్నారు. ఈ పాట విని జీవితంలో గెలుపు బాటలు వేసుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ పాటను వినండి. కచ్చితంగా మీలో ఉన్న భారం మొత్తం పోతుంది. పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాము.
Song Name | Ye Kommaki Ye Puvvo |
Lyrics – Singer – Music | Charan Arjun |
Producer | Dinesh Muthyam |
D o p – Director – Lead Actor | Arya K |
Female Lead | Sravani |
Editor | Arun Ravi |
Gmc Creative Head | Praveen Kumar Dandem |
Gmc Producer | Mallesh Kondeti |
Asosiate Director | Diensh |
Creative Adviser | Ganesh Reddy |
Technical Chaif | Venkataramana Reddy |
Youtube Video Song | Link |
Ye Kommaki Ye Puvvo Song Lyrics
ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో
ఏ చెట్టుకు ఏ కాయ కాయలో
ఏ గువ్వలు ఏ గూడు చేరాలో
అన్ని ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
ఏ గుండెకు ఎవ్వరు తొవ్వడో
ఏ పెదవికి ఎవ్వరి తో నవ్వులో
ఏ కథ ఏ తీరున సాగునో
అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
నువ్వడిగిపుట్టావా మీయమ్మకు
నువ్వు షెప్పేమనోచ్చవ మీ అయ్యకు
నువేంచుకున్నావా నీ ఊరిని
నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్ళని
లేదో నీ చేతుల్లో ఏది బాదెలారా
ఇప్పటిదాక జరిగిందంతా నెమరేయరా
అంతా మనమంచికే అనుకోవాలిరా
అట్ల జరిగింది గనుకే ఇప్పుడు ఇట్లులుందిరా
విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతావ్
ఓటమిలో ఉంటే నీకే ఎరుకైతది ఈ లోకం
ఇట్టాగే ఉండి పొదురయ్యో నీ జీవితం
అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు
దేశానికి మాత్రమే ఫ్రీడమ్ వచ్చింది
నాకింకా రాలే
ఐ లవ్ ఇండియా
బట్ ఐ హేట్ some ఇండియన్స్
అవరోధం దాటాకే అందును శిఖరం
గెలిచినా ప్రతి వాడి కథ చూడు నా మాటే నికరం
కొమ్మలపై పూసిన ఆకులు నేలన రాలు
భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కలే వట వృక్షాలు
ఓటమి అవమానాలు వూరికే రానే రావు
వస్తే ఏదో పాఠం నేర్పేక పోనే పోవు
న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు
చేసిన సాయం తప్ప ఏది నీతో రాదూ
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయ్ కష్టాలు
పోయిందే మున్నది ఇప్పుడు ఉన్నైగా ప్రాణాలు
ఒక దారి మూసుకు పోతే తేరుచుంటాది ఇంకో రాదారి
అన్ని ముందుగా రాసేఉంటాడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు