YCP Plenary 2022 | 8,9 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశంను జయప్రదం చేయగలరని జగ్గయ్యపేట ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట పట్టణం స్థానిక గెంటేలా శకుంతలమ్మ కళాశాల నందు జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో జరిగిన YCP Plenary 2022 సన్నాహక సమావేశ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా #ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గ,జిల్లా, రాష్ట్ర స్థాయిలో #ysrparty ఫ్లీనరీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని, ఆ సమావేశాలు విజయవంతం చేసేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది అని,రాబోయే సమావేశాలు ఏవిధంగా విజయవంతం చేయడానికి మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందివ్వాలని, నియోజకవర్గ పరిధిలోని దశాబ్దాలుగా Pendingలో ఉన్న సమస్యలు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో మా దృష్టికి తీసుకుని వస్తే జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వం ద్వారా తప్పకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈనెల 26 తారీఖున మధ్యాహ్నం 4 గంటలకు ఎస్ జి ఎస్ కళాశాల(SGS Collage Jaggayyapeta) నందు నియోజకవర్గ YCP Plenary 2022 సమావేశానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు అవ్వాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో #KDCC బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,పట్టణ అధ్యక్షులు చౌడవరపు జగదీష్,రాష్ట్ర సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్,రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బత్తుల రామారావు,చేని కుమారి ZPTC లు ఉట్ల నాగమణి,యేసుపోగు దేవమణి,గాదెల వెంకటేశ్వర్లు,MPP మార్కాపుడి గాంధీ,మండల పార్టీ అధ్యక్షుడు చిలుకూరు శ్రీను,గాదెల రామారావు,దేవినేని రామారావు, పెనుగంచిప్రోలు అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఇంజమ్ కేశవరావు,లగడపాటి నాగేశ్వరరావు గారు, వివిధ గ్రామాల సర్పంచులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.