Core Web Vitals Assessment: Atal Bihari Vajpayee Expressway: య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్పు?

Atal Bihari Vajpayee Expressway: య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్పు?

Atal Bihari Vajpayee Expressway ల‌క్నో: Uttar Pradesh లోని సిఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్ వేగా మార్పు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నెల 25న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జేవార్‌లోని Noida International Airport కు శంకుస్థాప‌న చేసే స‌మ‌యంలో పేరు మార్పుపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. ఆరు లైన్ల 165 కి.మీ పొడ‌వైన య‌మునా ఎక్స్‌ప్రెస్ హైవే గౌత‌మ్ బుద్ధ‌న‌గ‌ర్ జిల్లాలోని గ్రేట‌ర్ నోయిడాను ఆగ్ర‌తో క‌లుపుతున్నంది. ఈ Highway Road దేశంలోనే మూడో అతిపెద్ద పొడువైంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా – ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్ట‌ర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్‌ప్రెస్‌వే తో అనుసంధానించారు.

దేశానికి మూడు సార్లు ప్ర‌ధానిగా సేవ‌లందించిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee Expressway) అంద‌రి నుంచి మ‌న్న‌న‌లు అందుకున్నారు. ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ హైవేకు పేరు పెట్టాల‌ని UP CM భావిస్తున్నారు. నోయిడా అంత‌ర్మాతీయ విమానాశ్ర‌యానికి గురువారం ప్ర‌ధాని శంకుస్థాప‌న చేయ‌నుండ‌గా, దీంతో ఐదు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలున్న ఏకైక రాష్ట్రంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ నిలువ‌నుంది. ఇంత‌కు ముందు యూపీ ప్ర‌భుత్వం 2018లో ల‌క్నోలోని ఏక‌నా అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును భార‌త ర‌త్న అట‌ల్ బిహారీ వాజ్‌పేయి అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మార్చింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *