X-Ray: మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రులలో సాధారణంగా తీసేవి ఎక్సరేలు. ఈ ఎక్సరే వల్ల మన శరీరంలో ఏ అవయవం చిట్లిందో, ఏ అవయం పాడైందో డాక్టర్లు తేల్చి చెబుతారు. దీని వల్ల మన శరీరానికి చికిత్స చేయడం సులభం అవుతుంది. అయితే ఎక్సరేలు పదే పదే తీయించుకోవవడం చాలా ప్రమాదకరం అంట!. అది ఏలానో ఇప్పుడు చూద్ధాం!.
అనుబాంబు తో ఎక్సరే(X-Ray) సమానమా?
1896లో రాంట్‌జన్ తన భార్య చేతిపైకి ఎక్సరేలు పంపి చరిత్రలో తొలి X-Ray ఛాయా చిత్రాన్ని తీశారు. జీవితాంతం ఎక్స్ కిరణాలపై పరిశోధనలు చేసిన రాంట్‌జన్ చివరకు వాటి దుష్ఫ్రభావం వల్లనే 1923లో మరణించారు. ఎక్కువుగా X-Ray ఫొటోలు తీయించుకోవడం వల్ల మేలు కన్నా కీడు ఎక్కువుగా జరుగుతోం దని బ్రిటీష్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎక్స్ కిరణాలు ఒక రకంగా అయనీకరణ వికిరణాలు. అణుబాంబు విస్పోటనం చెందినప్పుడు వెలువడే అయనీకరణ వికిరణాలు అంత అయనీకరణ ప్రభావం ఈ ఎక్స్ కిరణాలకు ఉంది.
సరైన మోతాదులో ఎక్స్ కిరణాలను శరీరం మీద ప్రయోగించినప్పుడు కూడా అవి శరీరంలోకి చొచ్చుకుపోయి కొన్ని మంచి కణాలను నాశనం చేస్తాయట. అయితే ఈ ఎక్స్ కిరణాల స్థాయి తక్కువుగా ఉండటం వల్ల నాశనం అయిన కణాలు తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ప్రయోగించిన ఎక్స్ కిరణాల గురించి టెక్నీషియన్స్‌కు క్షుణంగా తెలియాలి. ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఎక్స్ కిరణాలు విడుదలయితే శరీరంలోని కణాలు ఎక్కువుగా నాశనం అవుతాయి.


దాంతో శరీరానికి ఎక్కువ హాని కలుగుతుంది. పదే పదే X కిరణాలు శరీరం మీద పడటం వల్ల కణాలు నాశనం కావడానికి బదులు అవి క్రమ రహితంగా పెరిగేందుకు ప్రేరణ పొందుతాయి. చివరకు క్యాన్సర్‌గా తయారు కావచ్చు. ఎక్స్ రే యంత్రాలు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇవ్వాల్సిన మోతాదుకు మించిన ఎక్స్ కిరణాలు విడుదలవుతున్నాయేమో చెక్ చేసుకోవాలి.