wyra news today వైరా: గత రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తెలంగాణలో పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో మరికొంత మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరా నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను సిపిఎం బృందం గురువారం పరిశీలించింది.

కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెంలో దెబ్బతిన్న మొక్కజొన్న (wyra news today)పంటలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణలు పరిశీలించారు. మొక్కజొన్నతో పంటు ఇతర పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్ట పరిహాం ఇవ్వాలని కోరారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!