Wyra MLA Ramulu Naik Daughter-in-law Shipra Srivastava CISF Officer | వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కు కోడలు తెచ్చిన అరుదైన గౌరవం!Wyra(Khammam): తెలంగాణ రాష్ట్రం, వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ స్థానిక నియోజకవర్గ ప్రజల నుంచి, కుటుంబం నుంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఇంట సంతోషకరమైన సంబురాలు జరుగుతు న్నాయి.దీనికి కారణం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోడలు, సీనియర్ ఐపీఎస్ అధికారి శిప్రా శ్రీవాస్తవ కు ఇండియన్ పోలీసు మెడల్ ప్రకటించడంతో వారి ఇంట ఆనందం వెల్లువిరిస్తోంది.


మామయ్యకు కోడలు తెచ్చిన అరుదైన గౌరవం!
ఎమ్మెల్యే కోడలు సీనియర్ ఐపీఎస్ అధికారి శిప్రా శ్రీవాస్తవ ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్‌లో ఐజీపీ క్యాడర్లో ముంబైలోని ఓఎన్జీసీ సీనియర్ పోలీసు కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తు న్నారు. రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్ ఓ సీనియర్ ఐఆర్ఎస్ అధికారి. ముంబైలోని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తమ నాయకుడి కోడలు జాతీయ స్థాయి మెడల్ కు ఎంపిక కావడంతో వైరాలో ఎమ్మెల్యే అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్‌కు వైరా ప్రజలతో మొదటి నుంచి మంచి అనుబంధం ఉండటంతో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎం, ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు అనేది ప్రతి పోలీసు అధికారికి ఒక కల లాంటింది. అది జీవితంలో నెరవేరితే వారు పొందే ఆనందం వర్ణణాతీతం. స్వతహాగా పోలీసులు అధికారి అయిన రాములు నాయక్ కు ఆ పతకం విలువ తెలుసు.


రైతు కుటుంబం నుంచి వచ్చిన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తొలుత పోలీసు కానిస్టేబుల్‌గా జీవితాన్ని ప్రారంభించారు. 37 ఏళ్ల పాటు అనేక హోదాల్లో పనిచేసిన రాములు నాయక్ ఎస్సైగా పదవీవిరమణ చేశారు. అనంతరం రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి మొదటి సారే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
విద్యతోనే విలువని తెలిపిన ఎమ్మెల్యే
మొదటి నుంచి మంచి క్రీడాకారునిగా పేరున్న ఎమ్మెల్యే రాములు నాయక్ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. మారుమూల పల్లెటూరి గిరిజన కుటుంబం నుంచి వచ్చినా చదువు విలువ తెలుసుకుని తన ఇద్దరు కుమార్తెలను బాగా చదవించారు. వారిలో ఒకరు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయురాలిగా, మరొకరు ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద అల్లుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా, చిన్న అల్లుడు ఎక్సైజ్ డిపార్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. అప్పట్లో నెలకు రూ.147 వేతనంతో పనిచేసిన సందర్భాన్ని అప్పుడప్పుడు ఎమ్మెల్యే రాములు నాయక్ గుర్తు చేసుకుంటుంటారు. స్వతృంత్రునిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రాములు నాయక్ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


వివాద రహితుడు -సేవా కార్యక్రమాల్లో ప్రథముడు
వివాదరహితునిగా పేరున్న రాములునాయక్ , తన కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బంజారా వర్గానికి చెందిన అనేక మంది పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. అంతే కాకుండా జీవన్ లాల్, శిప్రా శ్రీ వాస్తవ గార్ల ముద్దుల కుమారుడు హిమనిష్ సేవా కార్యక్రమాల వైపు నడిపించా లనే ఉద్ధేశ్యంతో ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ లో జనరల్ సెక్రటరీగా జాయిన్ చేపించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ కి ఎమ్మెల్యే రాములు నాయక్ గౌరవ సలహా దారులుగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


రాజీలేని పరిపాలన!
వైరా నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచి పాలన అందించడంలో ఎమ్మెల్యే రాములు నాయక్ విజయం సాధించారు. పార్టీలకతీతంగా అభివృద్ధి వైపు తన దృష్టి వుంచి ప్రతి సమస్యకు, తక్షణమే స్పందించే దిశగా పరిపాలనలో పలువురి మన్నననులు పొందుతున్నారు. సమస్య ఉందని దరఖాస్తు పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి వారి బాధలు చెప్పుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా ప్రతి సంక్షేమ పథకాన్ని నియోజకవర్గ ప్రజలకు అందిలే చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అటు ప్రజలలోనూ, ఇటు ఇంటిలోనూ తనదైన ముద్ర వేసుకొని తన కుటుంబాన్ని పలువురికి ఆదర్శవంతంగా తీర్చిదిద్ధినందుకు పోలీసు రాములు నాయక్‌కు సెల్యూట్ చేయాల్సిందే..!
-సేకరణ: జర్నలిస్టు సుధీర్ తాటిపల్లి (వైరా)
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్
ఇది చదవండి:తిరుపతి ఉప ఎన్నికలో జనసేన-బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి
ఇది చదవండి:నలుగురు తమిళ స్మగర్లు అరెస్టు
ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లో రాబోతున్న మెగాస్టార్!