world great inventor టూత్‌బ్రష్: మీరు ప్రతిరోజూ బ్రష్ చేసుకుంటారు కదూ. కానీ మీరు పళ్ళు తోముకోవడానికి వాడే బ్రష్ ఎలా పుట్టిందో తెలుసా? 15వ శతాబ్ధంలో చైనీయులు టూత్‌బ్రష్‌ని కనుగొన్నారని అంటారు. అయితే అంతకన్నా చాలా కాలానికి ముందు అరబ్బులు అరక్ అనే మొక్క నుండి తయారు చేసిన నార – పెన్సిల్ ని పళ్ళు తోముకు నేందుకు ఉపయోగించే వారట. వాళ్ళు ఉదయం సూర్యుడి వైపు తిరిగి నిలబడి తమ మతపరమైన కర్మ కాండాల్లో ఒక భాగంగా ఈ పనిని చేసేవారు. మనకు తెలిసినంత వరకు టూత్‌బ్రష్ అనేది తొలిసారిగా 1780లో జైలులో ఊపిరి పోసుకుంది. ఇంగ్లండులోని న్యూగేట్ జైలులో ఉండే ఓ ఖైదీ దీనిని రూపొందిం చాడు. ఒక ఎముక కొసలో చిన్న చిన్న రంధ్రాలు చేసి, ఆ రంధ్రాల్లో సన్నని పుల్లలను (బ్రిజిల్స్) అమర్చి, దానిని టూత్ బ్రష్‌గా అతను ఉపయోగించాడు. చాలా గొప్ప ఆలోచన కదా. అది అప్పటి సంగతి. ఇక ఈ రోజైతే ప్లాస్టిక్ హ్యాండిల్స్తోనూ, నైలాన్ పుల్లలతోనూ రకరకాల టూత్‌బ్రష్‌లు (world great inventor)తయారవుతున్నాయి.
రోబో ఎలా వచ్చాడు?
మనిషి సృష్టించిన ఓ వింత.. మర మనిషి అంటే రోబో. 1948 లో ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ గ్రేవాల్టర్ అనే వ్యక్తి తొలిసారి రోబోను రూపొందించాడు. అయితే ఈ ఆలోచన మాత్రం అంతకంటే చాలాయేళ్ల క్రితం నాటిదే అంటారు. క్రీస్తుపూర్వం 450వ సంవత్సరంలో గ్రీకు గణిత వేత్త ఒకరు మరపక్షిని తయారుచేసి, ఆవిరి ద్వారా ఎగరేశాడని కొన్ని గ్రంథాల్లో రాయబడింది. అలాగే లేపెక్ అనే చెక్ రచయిత తన రచనలో ఒక చోట రోబో అన్నమాటను వాడాడట. చెక్ భాషలో రోబో అంటే బానిస అని అర్థం. ఇవన్నీ జరిగిన కొన్ని వందల యేళ్ల తర్వాత గ్రేవాల్టర్ ఎలక్ట్రానిక్ అటానమస్ రోబోను తయారు చేశాడని చరిత్ర చెబుతోంది. 1950 ల తర్వాత రోబోల తయారీ బాగా పెరిగింది. రోబోటిక్ సైన్స్ అనే కొత్త విజ్ఞానశాస్త్రం ఆవిర్భవించింది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!