world facts

world facts: తాబేలు నెత్తిన ప‌డి గ్రీకు నాట‌క ర‌చ‌యిత మృతి ఇలాంటి ప్ర‌పంచ వింత‌లు తెలుసుకోండి!

Spread the love

world facts | ప్ర‌పంచ చ‌రిత్ర‌లో జ‌రిగిన కొన్ని నిజ సంఘ‌ట‌న‌లు వింటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇప్ప‌టి కాలానికి, అప్ప‌టి కాలానికి తేడా తెలుస్తుంది. పాల‌కులు, రాజులు ప‌రిపాల‌న ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది. ఒక మ‌నిషి క‌నుగొన్న గొప్ప విష‌యం వింత‌గా అనిపిస్తుంది. అలాంటి గొప్ప విష‌యాలు ప్రపంచంలో వింత‌లు, విశేషాలు(world facts) మీరు కూడా తెలుసుకోండి!.

world facts | ప్ర‌పంచ వింత‌లు, విశేషాలు

అకీవియ‌న్‌.డెమోక్రిట‌న్‌, హిప్పోక్రాట్ అనే ముగ్గురు మ‌నిషి మెద‌డును తెలివికి ప్ర‌ధాన క్షేత్రంగా భావించారు. కానీ Aristotle మాత్రం విబేధించాడు. మెద‌డు ర‌క్తాన్ని చ‌ల్ల‌బ‌రిచే కేంద్ర‌మ‌ని ఆయ‌న అన్నాడు.

క్రీస్తు పూర్వం 6వ శ‌తాబ్ధంలో గ్రీకు ఆర్కిటెక్ యుపాలిన‌స్ ఆధ్వ‌ర్యంలో అర‌మైలు పొడ‌వున్న సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈజియ‌న్ ద్వీపంలో కొండ‌ను రెండు వైపులా నుంచీ తొలుచుకుంటూ వెళ్లి చేసిన ఈ సొరంగ నిర్మాణం ఆ రోజుల్లో ఒక గొప్ప అద్భుతం.

గొడుకు కూడా ప్రాచీన ఈజిప్టు కాలం నాటిదే. రాజ కుటుంబీకులు ఉన్న‌త వ‌ర్గాల వారి సంప్ర‌దాయంలో వారి వారి స్థాయిని బ‌ట్టి వారికి గొడుకు ప‌ట్టేవారు. ఎండ వాన‌ల ప్ర‌యోజ‌నానికి దాన్ని అంద‌రూ ఉప‌యోగించే ప‌ద్ధ‌తి ఆ త‌ర్వాత కాలంలో వ‌చ్చింది.

వివాదాస్ప‌ద ర‌చ‌యిత డి.హెచ్‌.లారెన్స్‌కు బ‌ట్ట‌లు విప్పి malbari చెట్లు ఎక్క‌డ‌మంటే ఇష్టం.

గ్రీకు నాట‌క ర‌చ‌యిత ఈస్కిల‌స్‌. ఒక‌సారి ఒక గ్ర‌ద్ధ తాబేలును త‌న్నుకుపోతుంటే అది ఆకాశంలోంచి జారి ఈస్కిల‌స్ బ‌ట్ట‌త‌ల‌పై ప‌డ‌టంతో అత‌డు మ‌ర‌ణించాడు.

ర‌ష్య‌న్ మ‌హాక‌వి పుష్కిన్ ద్వంద్వ యుద్ధంలో మ‌ర‌ణించాడు. అత‌డిపై క‌విత రాసిన ర‌చ‌యిత లెర్మెంతోవ్ కూడా ద్వంద్వ యుద్ధంలోనే మ‌ర‌ణించాడు.

మాబెడిక్ న‌వ‌ల (1851) ర‌చ‌యిత హెర్మెన్ మెల్వి. అత‌డికి ఎలాంటి పేరు ప్ర‌తిష్ట‌లూ రాలేదు. దాంతో నిరాశ చెంది ర‌చ‌న‌లు మానేసి గుమాస్తా ఉద్యోగిగా జీవించాడు. మ‌ర‌ణానంత‌రం(1891) అత‌డికి ర‌చ‌యిగా గొప్ప పేరు ప్ర‌తిష్ట‌లు ల‌భించాయి.

జ‌ర్మ‌న్ మ‌హాక‌వి జాన్ వుల్ఫ్ గాంగ్ వాన్ గొథే. విదేశాంగ‌మంత్రి, నాట‌క ద‌ర్శ‌కుడు, న్యాయ‌వాది, పెయింట‌ర్‌, మైనింగ్ క‌మిష‌న‌ర్‌, శాస్త్ర‌వేత్త‌గా అత‌గు బ‌హుముఖ ప్ర‌సిద్ధుడు. ఎంద‌రో స్త్రీల‌తో అత‌డు సంబంధాలు పెట్టుకున్న‌వాడు. ఎముక‌ల‌పై 1784లో అత‌డు చేసిన ప‌రిశోద‌న 100 సంవ‌త్స‌రాల త‌ర్వాత డార్విన్ జీవ‌ప‌రిణామ‌క్ర‌మం సిద్ధాంతానికి స‌మాన‌మైన‌దిగా నిలిచింది.

రుడియా clippingకు మొద‌టి సంతానం క‌లిగిన‌ప్పుడు న‌ర్సుకు ఒక పుస్త‌కం బ‌హుమ‌తిగా ఇచ్చి ఇది ఉంచుకో, అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు దాన్ని అమ్మి సొమ్ము చేసుకో అన్నాడు. ఆ పుస్త‌కం వ‌ల్ల వ‌చ్చిన ఆదాయంతోనే ఆమె జీవితం గ‌డిపింది. ఆ పుస్త‌కం పేరేమిటో తెలుసా? జంగిల్ బుక్‌.

సుప్ర‌సిద్ధ అమెరికా క‌వ‌యిత్రి ఎమిలీ డికెన్స‌న్‌. ఆమె జీవిత కాలంలో ఏడు క‌విత‌లు మాత్ర‌మే ప్ర‌చురిత‌మ‌య్యాయి. కానీ 1886లో ఆమె మ‌ర‌ణానంత‌రం ఆమె ఇంట్లో 1000 క‌విత‌లు ల‌భించాయి.

అవ‌స‌రం అయితే నీ పిల్ల‌ల్ని, లేదా నీ పుస్త‌కాల్ని ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కాల్చేయ‌వ‌ల్సి వ‌స్తే ఏం చేస్తావు? అని ఫ్రెంచ్ ర‌చ‌యిత మాంటిగ్ని(Mantegna)ని ఎవ‌రో ప్ర‌శ్నిస్తే, నా పిల్ల‌ల్నే కాల్చేస్తాను అని స‌మాధానం ఇచ్చాడు.

క్రీస్తుపూర్వం 5వ శ‌తాబ్ధంలో నాటి గ్రీకు క‌వయిత్రి శాఫో. ఆమె క‌విత‌లు కామోద్రేకాన్ని రెచ్చ‌గొట్టేవ‌ని, లెస్బియిజంను ప్రోత్స‌హించేవ‌నీ ఆనాటి పెద్ద‌లు ఆరోపించారు. క్రీస్తు శ‌కం 12వ శ‌తాబ్ధం నాటికి వాటిని నామ‌రూపాలు లేకుండా చేశారు. కానీ 1897-1906 మ‌ధ్య జ‌రిగిన Nileన‌దీ ప‌రిశోధ‌న‌ల్లో Shafo రాసిన రెండు క‌విత‌లు ల‌భ్య‌మ‌య్యాయి.

సుప్ర‌సిద్ధ ఆంగ్ల నిఘంటు ర‌చ‌యిత శామ్యూల్ జాన్స‌న్‌. 5 పౌండ్ల 8 షిల్లింగులు అప్పు చెల్లించ‌లేక‌పోవ‌డంతో జైలు పాల‌య్యాడు. న‌వ‌లా ర‌చ‌యిత శామ్యూల్ రిచ‌ర్డ్‌స‌న్ అత‌న్ని జైలు నుంచి విడుద‌ల చేయించాడు.

సుప్ర‌సిద్ధ ఫ్రెంచ్ ర‌చ‌యిత వాల్టేర్‌. Newton రాసిన ప్రిన్సిపియా మాథ‌మాటికా ను ఫ్రెంచ్ భాష‌లోకి అనువదించి ఫ్రాన్స్‌లో అత‌డికి గొప్ప పేరు ప్ర‌తిష్ట‌లు తీసుకువ‌చ్చాడు.

స‌ర్ వాల్ట‌ర్ స్కాట్ విస్తృతంగా రాసి పేరు ప్ర‌ఖ్యాత‌లు, సంప‌ద ఆర్జించాడు. కానీ ప‌బ్లిషింగ్ కంపెనీలో ఆ సొమ్మంతా పెట్టుబ‌డిగా పెట్టి దివాళా తీసి ల‌క్షా 30 వేల పౌండ్ల మేర‌కు అప్పుల పాల‌య్యాడు. భార్య‌, కొడుకు, మ‌న‌మ‌డు చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఆ అప్పులు తీర్చ‌డానికే జీవితాంతం ర‌చ‌న‌లు చేస్తూ వ‌చ్చాడు.

ప్ర‌పంచంలో అతి పురాత‌న‌మైన స‌రిహ‌ద్దు వాణిజ్య మార్గం Khyber క‌నుమ‌లు. ఈ మార్గంలోనే అతి త‌క్కువ సైన్యంతో ప్ర‌యాణించి వ‌చ్చాడు బాబ‌ర్‌. ఆనాటి భార‌త పాల‌కుడు ఆఫ్ష‌న్ రాజు ఇబ్ర‌హీం ల‌క్ష సైన్యంతో ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఆ యుద్ధంలో బాబ‌ర్ గెలిచాడు. కార‌ణం అత‌డి వ‌ద్ద Gun పౌడ‌ర్ ఉంది.

రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో Russia పాల‌కుడు స్టాలిన్‌. అత‌డి కుమారుడు జాక‌బ్ నాజీ జ‌ర్మ‌నీ సేన‌ల‌కు దొరికిపోయాడు. బందీల‌ను ఇచ్చి పుచ్చుకునే ప్ర‌క్రియ‌లో జాక‌బ్‌ను విడుద‌ల చేస్తామ‌ని జ‌ర్మ‌న్లు విధించింన ఆంక్ష‌ను Stalin తిర‌స్కించాడు. చివ‌ర‌కు జాక‌బ్ ఖైదీగానే మ‌ర‌ణించాడు.

మ‌ధ్య Americaలో ఉన్న దేశం కోస్టారికా(costa rica). ఆ దేశ జ‌నాభా ఇరువై ల‌క్ష‌లు(అప్ప‌ట్లో) ఆ దేశానికి సైన్యం లేదు.

1978 నాటికి లెక్కిస్తే ప్ర‌పంచం ఆయుధాల‌పైన స‌గ‌టున నిమిషానికి 8 ల‌క్ష‌లు డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది. ఇరువ‌య్యో శ‌తాబ్ధానికి ఈ ఖ‌ర్చు 400 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది.

ప్రాణ‌మున్న అతి చిన్న సూక్ష్మ‌జీవుల‌నే బాక్టీరియా అని పిలుస్తాం. ఒక చిన్న నీటి బిందువు అంత స్థ‌లం ఐదు కోట్ల సూక్ష్మ‌జీవులు నివ‌శించాడినిక స‌రిపోతుంది.

amazing facts for students:ఔరా! అనే కొన్ని వింత విశేషాలు గురించి తెలుసుకోండి!

amazing facts for studentsఈ ప్ర‌ప‌చంలో ప్ర‌తిదీ వింత‌గానే క‌నిపిస్తుంది. మాన‌వుని జీవితం ద‌గ్గ‌ర నుంచి చిన్నక్రిమి కీట‌కం వ‌ర‌కు జీవ‌న శైలి వైరుఢ్య భ‌రితంగా ఉంటుంది. Read more

Second Wave: నాడు అగ్ర‌రాజ్యాన్ని నేడు భార‌త్‌ను Covid చుట్టుముట్టింది!

Second Wave: నాడు అగ్ర‌రాజ్యాన్ని నేడు భార‌త్‌ను Covid చుట్టుముట్టింది! Second Wave: క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌ను చుట్టుముట్టింది. ప్ర‌జ‌లెవ్వ‌ర్నీ ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. మునుపెన్న‌డూ లేనంత ఉధృతితో Read more

Long March 5b Rocket : మ‌రి కొద్ది గంట‌ల్లో భూమిని తాక‌నున్న చైనా రాకెట్‌..ఎక్క‌డంటే?

Long March 5b Rocket : చైనా ప్ర‌యోగించిన లాంగ్ మార్చ్ 5 బి రాకెట్ విఫ‌ల‌మై భూమికి మ‌రికొద్ది గంట‌ల్లో చేరుకోబోతుంది. అది భూమిని తాకినిప్పుడు Read more

Nibba Nibbi: నిబ్బ-నిబ్బి ప‌దాల వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!

Nibba Nibbi | తెలుగులోని హిందీలోని ఎక్కువుగా యూట్యూబ్‌లో క‌నిపించే ప‌దం నిబ్బా-నిబ్బి. ఈ ప‌దం పై youtube లో ప‌దుల సంఖ్య‌లో వీడియోలు ఉన్నాయి. అస‌లీ Read more

Leave a Comment

Your email address will not be published.