World Coconut Day 2022: మనిషికి అత్యంత చవకైన ఆహారం, ప్రకృతి నుండి లభించే కొబ్బరి లాభాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే చెట్టు మొదలు కొబ్బరి, ఆకులు వరకు మనిషి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతునే ఉన్నాయి. ప్రపంచ కొబ్బరి దినోత్సవం (World Coconut Day 2022) సందర్భంగా వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం!
World Coconut Day 2022: కొబ్బరి ప్రయోజనాలు
కొబ్బరిలో ఆవుపాల కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆవు పాలతో పోలిస్తే అతి సులభంగా జీర్ణం అవుతాయి. కొబ్బరిలో Omega అనే ఆమ్లాలు 9 శాతం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ ఒమెగా లో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరి పాలు మనలో జీర్ణ సమస్యలు తొలగిస్తాయి. జీర్ణాశయంకు సంబంధించిన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.


కొంత మందికి పాల ఉత్పత్తులు వాడకం ఇష్టం ఉండదు. వారు కొబ్బరి పాలను తీసుకుంటే చాలా మంచిది.కొబ్బరి పాలలో భాస్వరం మరియు కాల్షియం వంటి పోషక పదార్థౄలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. ఎముకలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా వాటి నివారణలో సహాయ పడతాయి. అంతే కాకుండా గ్లూకోజ్, రక్తంలో చక్కెర నిల్వలు తక్కువుగా ఉన్న వారికి ఇది చాలా మంచిది.
కొబ్బరి తినడం వల్ల మన శరీరంలో ఉన్న ఒత్తిడిన తగ్గించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. రోజుకు కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే మనలో ఉన్న రక్తహీనత తొలిగిపోతుంది. మన ఎముకలలోని ఏమైనా నొప్పి, వాపు ఉంటే వాటిని దూరం చేసి బలిష్టంగా ఉంచుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ బారి నుండి కొబ్బరి కాపాడుతుంది. అధిక బరువు ఉన్నవారు కొబ్బరి నీరు తాగితే ఫలితం ఉంటుంది.
కొబ్బరి (World Coconut Day 2022) లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువుగా కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని ఎప్పటికప్పుడు పెంచుతుంది. త్వరగా వృద్ధాప్యం రాకుండా ముఖంపై ముసలి మడతలు పడకుండా ఉండాలంటే కొబ్బరి తినాల్సిందే. గుండెకు కొబ్బరి తింటే మంచిది. ఇందులో ఉండే కొలెస్ట్రాల్ గుండె పనితీరును మెరుగుపర్చడంతో పాటు గుండె జబ్బులను రానివ్వకుండా కాపాడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు సైతం కొబ్బరి తింటే ఆ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. పచ్చి కొబ్బరిలో బికాంప్లెక్స్ విటమిన్లు, రైబోఫ్లెవిన్, నియాసిన్, థయామిన్ ఉంటాయి. ఎవరైనా తరచూ నోటిపూతతో బాధపడేవారు కొబ్బరి తిన్నా, కొబ్బరి పాలు తాగినా పోషకాలు అంది ఆ సమస్య త్వరగా నయమవుతుంది.


World Coconut Day 2022: అందానికి కొబ్బరి మేలు!
కొబ్బరి అందాన్ని పెంచడంలో మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలతో జుట్టు మృదువు అవుతుంది. మన జుట్టు కుదుళ్లను దృఢం చేస్తుంది. కొబ్బరి పాలను మాడుకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేస్తే మన జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి హెయిర్ మృదువుగా అవుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి 2-3 గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంతరం బయటకు తీసి, దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని మన తల మాడుకు పట్టించి, వేడి నీళ్లతో ముంచిన మెత్తని ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట సేపు అలానే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే వెంట్రుకలు మృదువుగా, ఉడిపోకుండా ఉంటాయి.