workout on an Empty Stomachఆరోగ్యానికి ఆరోగ్యం.. అందానికి అందం.. ధృడత్వానికి ధృడత్వం ఇవన్నీ ఒకేచోట ఎక్కడైనా దొరికితే అది పక్కా ఎక్సర్సైజేనని సూచిస్తున్నారు ఫిట్నెస్ ట్రైనర్లు. కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? తిన్నాక చేయాలా? తినకముందు చేయాలా అన్నదానిపై చాలా మందికి అవగాహన తక్కువ. ఎడాపెడా ఎక్సర్సైజ్లు చేస్తుంటారే తప్ప దాంట్లో ప్రామాణికత ఉండదు. ఒళ్లు తగ్గించుకోవాలని ఎక్సర్సైజ్ చేస్తే సరైన మెలకువలు తెలియక ఓవర్ వెయిస్ సమస్య వచ్చిపడుతుంటుంది. కాబట్టి సరైన (workout on an Empty Stomach)మెలకువలు పాటించాలి.


కనీసం కాఫీ అయినా తాగనిదే మనోళ్లకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేదు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా ఇలా ఇష్టమొచ్చినట్టు ఎక్సర్సైజ్లు చేసుకుంటూ పోతే బరువు అధికమయ్యే ప్రమాదముంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ముగించుకుని ఎక్సర్సైజ్ చేయడమనేది ఇప్పట్నుంచి మరిచిపోకండి. పరగడుపున ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు నరాల పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా బ్లడ్ సర్యులేషన్ కూడా సక్రమంగా జరుగుతుంది. మనసు ప్రశాంతత కలుగుతుంది. ఇన్సులిన్ నిరోధకతను కంట్రోల్లో ఉంచుతుంది. పేరుకుపోయిన కొవ్వను తగ్గిస్తుంది. కాబట్టి పరగడపున మాత్రమే ఎక్సర్సైజ్ బెటర్ అని గుర్తించుకోవాలి. కాకపోతే నీరసంగా ఉన్నప్పుడు మాత్రం ఏమీ తినకుండా ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదట!
12 Hours Exercises తో పంచ వ్యాధులు దూరం
వ్యాయామంతో ఆరోగ్యం పదిలమని వింటూనే ఉన్నాం. ముఖ్యంగా పక్షవాతం, గుండెపోటు, మధుమేహం, రొమ్ము, పేగు క్యాన్సర్ల ముప్పును కసరత్తులతో కట్టడి చేయవచ్చని గతంలో చాలా పరిశోధనలూ తేల్చాయి. తదనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామ ప్రమాణాలను కూడా రూపొందించింది. ఆ ప్రకారం, ప్రతి ఒక్కరూ నడక, తోటపని వంటి తేలికపాటి వ్యామాలైతే వారానికి 150 నిమిషాలూ.. పరుగు, సైకిల్ తొక్కడం వంటి కసరత్తులైతే 70 నిమిషాలు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది దీనినే పాటిస్తున్నారు.


కానీ, ఈ నిడివి సరిపోదని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ పరిశోధకులు వెల్లడించారు. భారత్ సహా చైనా, దక్షిణాఫ్రికా, అమెరికాలో చేపట్టిన 200 అధ్యయనాలను విశ్లేషించి మరీ ఈ నిర్ణయానికి వచ్చారు. 1990 నాటి పనికి సమానమైన జీవక్రియ (మెట్) సూచీని ఆధారం చేసుకుని రకరకాల పనులకు అవసరమయ్యే శక్తిని, వ్యాయామ నిడివిని మదింపు చేశారు. ఆ ప్రకారం దీర్ఘకాలిక రుగ్మతలు దరిచేరకూండా ఉండాలంటే తేలికపాటి వ్యాయామాలు వారానికి కనీసం 12.30 గంటలు, కష్టతర వ్యాయామాలైతే 6.15 గంటలు చేయాలని సూచిస్తున్నారు. ఈ తాజా పరిశోధనను అంతర్జాతీయ వ్యాధి నిరోధక పరిశోదన సంస్థ ఆచార్యుడు ఫిలిపె అటిర్ విశ్లేషిస్తూ ”రుగ్మతలపై వ్యాయామ నిడివి ప్రభావం గురించి ఇప్పుడో అవగాహన వచ్చింది. కానీ, ఆరోగ్య ప్రయోజనాల కోసం కష్టతర కసరత్తులు చేయాలా, లేక తేలికపాటి వ్యాయామాలు మంచిదా అన్నదానిపై స్పష్టత రాలేదు” అని వ్యాఖ్యానించారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?