Working Women | ఉద్యోగినులు ఆఫీసు బాధ్యతలతో బిజీ. ఇల్లాలికి ఇంటిపనులూ, పిల్లల బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. విద్యార్థినికి పరీక్షలూ ర్యాంకుల హడావిడి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రోజుకి కనీసం ఓ అరగంటైనా సమయం కేటాయించుకోవాలి. అప్పుడే ఆనందం, ఆరోగ్యం..అంటూన్నాయి అధ్యయనాలు. అరగంట సమయంలో ఏం చేయగలం అంటారా..!
మీ అభిరుచికి తగ్గ వ్యాపకాలు చాలానే ఉంటాయి. పని ఒత్తిడి(Working Women)లో వాటిని పక్కన పెట్టి ఉంటే మళ్లీ గుర్తు చేసుకోండి. చక్కని Painting వేయడం, ఎంబ్రయిడరీ చేయడం, కవితలు రాయడం, ఇలా ఏవైనా సరే, వాటిని సాధన చేసేందుకు సమయం కేటాయించండి. కచ్చితంగా మీకు అది నూతనోత్సాహాన్ని అందిస్తుంది. మీకు సంతోషాన్ని చేరువ చేస్తుంది.
ప్రకృతి అందించే మానసిక ఆనందమెంతో రోజుకి ముప్పై నిమిషాలు Plants పెంపకానికి ఉపయోగించండి. ఖాళీ స్థలం లేదంటారా..ఆలోచిస్తే బోలెడు చిట్కాలు. వాడి పారేసిన బకెట్లూ, సీసాలు, డబ్బాలు ఉంటే beautifulగా తీర్చిదిద్దండి. మట్టిని నింపి నచ్చిన విత్తనాలు వేయండి. అవి పెరుగుతుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోందో చెప్పలేం. రోజురోజుకీ మీకు వాటి కోసం కేటాయించే సమయం పెరుగుతుంది.
ఎంత పనిచేసినా ఆరోగ్యానికి, ఆనందానికీ వ్యాయామం తప్పనిసరి. చిన్నప్పుడెప్పుడో వదిలేసిన Cyclingని తిరిగి మొదలు పెట్టండి. తాడాట, తొక్కుడు బిళ్ల వంటివి చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చి, ఉల్లాసంగా ఉంచుతాయి. గందరగోళంగా ఉండే మానసిక ఆలోచనలు ఓ స్పష్టమైన రూపం తీసుకోవాలంటే ముందు మెదడుని తేలికపరుచుకోండి. కాసేపు నీళ్లతో ఆటలు ఆడండి. పార్కుకెళ్లికి వెళ్లి సేదతీరండి.
Time Managment చాలా ముఖ్యం
వర్కింగ్ womenకు టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని మానసిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అన్ని పనులు సక్రమంగా చక్కబెట్టుకోకపోతే సమయం వృధా పోయి చివరికి హడావుడి పడాల్సి వస్తుంది. ఏ పనికైనా Time Managment ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. ముఖ్యంగా మిమ్మల్ని పక్కదారి పట్టించే అంశాలను తిరస్కరించండి. మీ ఆలోచనలు అటూ, ఇటూ తిరుగుతుంటుంటే సరి చేసుకోండి.
ఓ కచ్చితమైన Planing చేసుకోవడం ద్వారా మీ చుట్టు ప్రక్కల ఉన్న గందరగోళ పరిస్థితిని నివారించుకోండి. ఒక నిర్థిష్టమైన సమయంలో మీరేం సాధించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఎలాంటి ఆనందాన్ని ఇవ్వని, అర్థంపర్థం లేని అనుబంధాలను ఎప్పటికీ పూర్తికాని పనులను, చెడు అలవాట్లకు goodby చెప్పండి. ఇవి మీ సమయాన్నీ, శక్తిని వృథా చేస్తాయి.

Negative గా ఉండేవారితో దూరం
ఎప్పుడూ మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ డిమాండ్ చేసే వ్యక్తులకు, ఎప్పుడూ మీ పట్ల నెగిటివ్గా ఉండేవారికి వీలైనంత దూరంగా ఉండండి. చేయాల్సిన పనులు రేపు రేపు అంటూ వాయిదా వేయకుండా ఇవాళే చేస్తూ ఉండండి. మీకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా చేయాల్సిన పనుల్ని చేసేలా మీ ప్రణాళిక రూపొందించుకోండి. ఏ పని చేసినా Organize చేసుకోండి. అది మీ డెస్క్ అయినా మీ వార్డ్రోబ్ అయినా సరే.
పనికిరాని వస్తువులను నిర్ధాక్షిణ్యంగా పారేసి, అంతా శుభ్రంగా ఉంచుకోండి. పనికిరానివి, పనికివచ్చేవి, వాడేవి, వాడనవి అన్నీ కలగలిపి పడేసుకోవడం వల్ల అవసరమైనవి వెతుక్కునేందుకే Time సరిపోతుంది. దీనికి తోడు వస్తువు కనబడలేదని ఒత్తిడికి గురవుతారు. ఎక్కువ సమయాన్నీ TV, కంప్యూటర్ల దగ్గర గడపకపోవడమే మంచిది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!