work from home IT హైదరాబాద్: కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీలు తమ కార్యాచారణను కొనసాగుతున్నాయి. కోవిడ్ రెండో దశ కేసులు తగ్గాక, కార్యాలయాలకు కొద్ది మంది ఐటీ ఉద్యోగులు వస్తున్నారు. అయితే గడిచిన వారం రోజుల్లో కరోనా ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్నందున ఇంటి నుంచే పనిచేయాలని(work from home IT) సంబంధిత సంస్థల యాజమన్యాలు సూచిస్తున్నాయి.
అయితే సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయడం ప్రారంభించగా, బుధవారం నుంచి మరికొన్నిసంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్టు స్థానిక ఐటీ పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఒమిక్రాన్ ముప్పు ఇంకా పెరిగితే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు, సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉంది. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున, కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!