Work From home ఇంత ట్రాఫిక్‌లో ఆఫీసు కెళ్లడం నా వల్ల కాదు అని చేతులెత్తేసింది పింకీ..ఎన్ని పాట్లైనా పడి ఆఫీసుకు త్వరగా వెళదామన్నా ప్రతి రోజూ లేటైపో తుంది..అని బెంగపడింది స్వాతి..ఆఫీసులో అంత ఒత్తిడిని ఎదుర్కోవడం నాకో సమస్యైపోయిందని అని చికాకు ప్రదర్శించిన వర్ష..ఇది మహిళ ఉద్యోగులకు నిత్యం ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలుగా చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా దెబ్బకు ఆఫీసులన్నీ కూడా మూతపడిపోయాయి. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా తెరుచుకున్నాయి. అయినప్పటికీ కరోనా సమయంలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం నిర్వహించాయి. వారికి ఆన్లైన్లో వర్క్‌ను అందజేస్తూ నెలవారీగా జీతాలు చెల్లించింది. ఇక ఇది ఇలా ఉంచితే మనం ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సమస్య గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆపసోపాలు పడుతూ ఆఫీసుకె వెళ్లకుండా ఇంట్లో నుంచే కంప్యూటర్ ద్వారా చేసుకునే ఉద్యోగాలు(Work From home) పెరిగిపోయాయి. మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్, డాటా ఎంట్రీ, కంపోజింగ్, డిజైనింగ్ వంటి పనులు ఇంటి నుంచే కంప్యూటర్ సహాయంతో చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఉద్యోగాలు చేసేటప్పుడు లాభాలు ఉన్నట్టే..నష్టాలూ లేకపోలేదు.


ప్రస్తుతం అనేక మంది ఉద్యోగినులు ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంటున్నారు. వినడానికి ఇది కప్పులో కాఫీ పోసినంత తేలికగానే ఉన్నా దీనిని ఆచరణలో పెట్టాలంటే కొన్ని ఆటుపోట్లని ఎదుర్కోక తప్పదు. ఇంటి వద్ద ఉండి పనిచేయడంలో ఒత్తిడి ఉండకపోవచ్చు కానీ.. ఇక్కడ కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇవి చాలా చిన్న సమస్యలే అయినప్పటికీ పనిచేసే విధానానికి ఆటంకాలుగా మారతాయి. ఇలా ఉండి ఉద్యోగం చేసే విషయంలో అసౌకర్యాలతో పాటు కొన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి పరిశీలిద్ధాం.
అసౌకర్యాలు ఇవే..
అసైన్మెంట్ ఇవ్వాల్సింది సాయంత్రానికి కదా అని తీరికగా పని మొదలెట్టాల నిపిస్తుంది. తీరా సాయంకాలానికి కూడా పని మొదలవ్వదు. సమయం సరిపోక చివరి ఘడియల్లో హడావుడిగా పని జరిగిపోతుంది. దీంతో చేసే పనిలో నాణ్యత, పరిపూర్ణత లోపిస్తాయి. కొత్త టెక్నాలజీకి సంబంధించిన అంశాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఒక్కోసారి అందులో పదాలు గజిబిజిగా ఉండి అర్థం కాక తొందరపాటులో మరిన్ని తప్పులు చేస్తాము. చేసే పనిలో తోచిన విధంగా వ్యవహరించడానికి కుదరదు.


కొత్తగా వచ్చే ఆలోచనలని చేసే పనికి జోడించాలనుకున్న ప్రతిసారీ పైవారికి సంజాయిషీ చెప్పాల్సి ఉంటుంది. సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఎవరి సహాయం అందదు. దగ్గరలో ఎవరన్నా నిపుణులు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. అయినా వారికోసం ఎదురుచూస్తూ కూర్చుంటే మనకు ఇచ్చిన సమయం మించిపోతుంది. పనిచేసేటప్పుడు ఏకాగ్రత కుదరకపోతే కాసేపు రిలాక్స్ అవ్వాలనో,బుక్ చదవాల నోనిపిస్తుంది. లేదా కాస్త వైరైటీగా లంచ్ చేయాలనుకోవడమో, ఫోన్లో బాతాకానీ కొట్టడమో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేసే పనికీ అడ్డుగా మారుతాయి. అప్పుడు ఇష్టమైన కోరికలనే బలవంతంగా అణుచుకోవాల్సి వస్తుంది.
సౌకర్యాలు ఇవే…


ఒత్తిడి తగ్గుతుంది. రోజువారీ ట్రాఫిక్ సమస్యను దూరం చేసుకోవచ్చు. సమయానికి రావాలి. ఇంటికి తొరగా వెళ్లాలనే భయం ఉండదు. దర్జాగా మనకి మనమే బాస్ అనిపించేలా ఉంటాయి. ఆఫీసు కొలిగ్స్ని భరించడం, పిచ్చాపాటి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయడం ఉండదు. ఓవర్ నైట్ పనిచేయాల్సిన అవసరం లేదు. మనకు అవసరమైతే పని వాయిదా వేసుకోవచ్చు. లేదా ముందుగానే, వెనుకగానీ చేసుకునే అవకాశం ఉంటుంది. వేసుకున్న ప్రణాళిక కంటే ముందే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఏదైనా ఊరు వెళ్లాల్సి వస్తే వెంటనే ఆలోచించకుండా వెళ్లిపోవచ్చు. బాస్‌కు లీవ్ లెటర్ ఇవ్వాలనే రూల్ ఉండదు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!