Womens's Day

Womens’s Day : మ‌హిళ లేక‌పోతే మ‌నం లేము!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

కొవ్వొత్తుల ర్యాలీలో తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ
ఒక రోజు మ‌హిళా పోలీసుల‌కు సెల‌వు

Womens’s Day : Tirupati Urban : త్యాగానికి మారుపేరు స్త్రీ అని తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ సిహెచ్ వెంక‌ట అప్ప‌ల నాయుడు అన్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం రాత్రి తిరుప‌తిలో ప్ర‌కాశం రోడ్ లోని ఎస్పీ కార్యాయ‌లంలో పోలీసు సిబ్బందితో క‌లిసి ఎస్పీ సిహెచ్ వెంక‌ట అప్ప‌ల‌నాయుడు కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ రోజు మ‌హిళా దినోత్స‌వం క‌న్నా మాతృ దినోత్స‌వం క‌న‌బ‌డుతోంద‌న్నారు. అంద‌రం ఒకే చోట క‌ల‌వ‌డం చూస్తే ఇక్క‌డ ఉన్న అందరిలో అమ్మ‌, అక్క‌, చెల్లెలు క‌న‌బ‌డుతున్నార‌న్నారు. అదే విధంగా ఇంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా క్యాండిల్ ర్యాలీ లో పాల్గొన‌డం సంతోష‌క‌ర‌మైన విష‌యం అని అన్నారు.
మ‌నం ఒక బాధ్య‌త‌గ‌ల ఉద్యోగంలో ఉన్నామ‌ని, ముందుగా చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న మ‌న‌కే ఉంటుంద‌ని అన్నారు. దిశదిశ‌లా వ్యాప్తి చెందించి మ‌హిళ‌ల‌లో ఆరోగ్య‌క‌ర‌మైన చైత‌న్యం తీసుకురావాల‌న్నారు. ఎంద‌రో మ‌హిళ‌లు వారికి జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేక మ‌న‌సులోనే పెట్టుకొని మ‌ద‌న ప‌డుతున్నార‌న్నారు. ఈ వ్య‌వ‌స్థ మారాల‌ని, మార్పు తీసుకురావాల‌ని కోరారు. మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడే వ‌నిత‌ల‌కు అండ‌గా ఉండాల‌ని అన్నారు. ప్ర‌భుత్వం ఎన్నో ర‌కాలుగా మ‌హిళ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌న్నారు.

కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌లో మాట్లాడుతున్న తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ వెంక‌ట అప్ప‌ల‌నాయుడు

దిశ యాప్ వినియోగించుకోవాలి: ఎస్పీ

దిశ యాప్ మ‌హిళ‌ల‌కు ఒక ఆయుధ‌మ‌ని, ఒక భ‌ద్ర‌త అని ఎస్పీ అన్నారు. దిశా యాప్ మీ అన్న‌, త‌మ్ముడువ‌లే ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌న్నారు. కాబ‌ట్టి మ‌హిళ‌లు, విద్యార్థినులు దిశా యాప్ ను మీ మొబైల్ నందు డౌన్‌లోడ్ చేసుకుని ఒక ర‌క్ష‌ణ గ‌ల మ‌హిళ‌గా, ఆద‌ర్శంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌రోసారి శుభాకాంక్ష‌లు తెల‌పుతూ మ‌హిళా పోలీసు సిబ్బందికి ఒక్క‌రోజు సెల‌వు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ఎస్పీ తెలిపారు.
ఈ కార్య‌క్రమంలో అడ్మిన్ అడిష‌న‌ల్ ఎస్పీ సుప్ర‌జ, డిఎస్పీలు, ఎస్‌బిఎం వి.ర‌మ‌ణ‌, ఎస్సీఎస్టీ సెల్ కాట‌మ‌రాజు, ఏ.ఆర్ డిఎస్పీ నంద కిషోర్‌, ఆర్ఐలు శ్రీ‌నివాసులు, చంద్ర‌శేఖ‌ర్‌, ర‌వికుమార్‌, మ‌హిళా ఎస్ఐలు, ఆర్ఎస్లు సిబ్బంది మ‌రియు పోలీసు అసోసియేష‌న్ ప్రెసిడెంట్ సోమ‌శేఖ‌ర్‌, శంక‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సెల్ఫీ తీసుకుంటున్న మ‌హిళా పోలీసు అధికారులు

ఇది చ‌ద‌వండి: అలాంటి వారికి ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు మూసుకుపోయిన‌ట్టే?

ఇది చ‌ద‌వండి:10 life changing Principales

ఇది చ‌ద‌వండి: ఆ జంతువుకు నిజంగానే విముక్తి క‌లిగింది!

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *