Women’s day Inspiring storie 2022 | అభివృద్ధి చెందిన మనదేశంలో దర్శకత్వం రంగంలో మహిళలు తక్కువ. మరీ సౌదీ అరేబియాలో అంటే మహిళా దర్శకులు అసలే కనిపించరు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పాత్రికేయరాలు సాహసం చేసింది. ఉద్యోగం చేసిన అనుభవంతో మొదటిసారి సినిమా తీయడానికి ముందుకొచ్చింది. తనే హైఫా(Haifaa) అల్ మన్సూర్. వరల్డ్ ఉమెన్స్ డే 2022 సందర్భంగా ఆమె స్టోరీ (Women’s day Inspiring storie 2022) తెలుసుకుందాం!.
పాత్రికేయురాలిగా పని చేస్తున్నప్పుడు మహిళలు ఎక్కడికైనా వెళ్లడానికి స్వేచ్ఛలేక బాధపడటం, ఆంక్షలతో రకరకాలుగా ఇబ్బంది పడటం గమనించింది. ముఖ్యంగా మహిళలు అక్కడ డ్రైవింగ్ చేయడం నిషేధం. దీన్నే కథాంశంగా ఎంచుకుంది హైఫా. ఓ టీనేజీ అమ్మాయికి సైకిల్ తొక్కాలని కోరిక. దానిపై రయ్యిమంటూ వీధుల్లో చక్కర్లు కొట్టాలని ఆశ. అన్ని అడ్డంకుల్నీ దాటుకుని తను ఆ కోరికను ఎలా సాధించుకుంది. అనేది సినిమా కథ. దీన్ని అమ్మాయిలతో తెరకెక్కించాలనుకుంది.
కానీ ధైర్యంగా ఎవరూ ముందుకు రాలేదు. చిన్నారులకైతే కొంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వారిని ఎంచుకుంది. వీధుల్లో ఓబీ వ్యాను పెట్టుకుని అందులో కూర్చొని వాకీటాకీ ద్వారా పాపకీ, ఇతరత్రా బృందానికి సూచనలిస్తూ సినిమా చిత్రీకరణ పూర్తి చేసింది. ప్రత్యక్షంగా ఉండి, మార్పులు చెబుతూ సినిమా తీయడమే కష్టం. అలాంటిది దూరంలో ఉండి వాకీటాకీలో మాట్లాడుతూ దర్శకత్వం వహించడమంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. సౌదీ అరేబియాలో ఓ మహిళ మరో మహిళ గురించి సినిమా తీయడం ఇదే మొదటిసారి. మొదట పెద్ద ఎత్తున్న విమర్శలొచ్చినా, జాతీయ స్థాయిలో ఆ సినిమాకు చాలా అవార్డులొచ్చాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!