gas cylinder price: పిఠాపురం : మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని సిఐటియు, ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పిఠాపురం కాలనీ మార్కెట్ జంక్షన్లో మహిళలు వినూత్న నిరసన చేపట్టారు.
పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని, సామాన్యులపై భారాలు వేస్తున్న మోడీ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెరిగే ధరలకు హద్దేలేదా.. ఏలేవాడికి బుద్దేలేదా? అంటూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
సిఐటియు కార్యాయలం నుండి మద్దిలపాలెం వరకు గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శనగా వెళ్లి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి.కృష్ణారావు, ఐద్వా జోన్ కో కన్వీనర్ కె.కుమారి మాట్లాడారు.


మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గ్యాస్ ధరలు(gas cylinder price) పెంచి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చుతోందన్నారు. 2వ దశ కోవిడ్ తర్వాత 5 దఫాలుగా పైగా పెంచిందన్నారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సెంచ్రీ దాటిపోయిందన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ భారీగా ధరలు పెంచి సామాన్యుడిపై భారాలు మోపుతుంటే మహిళలు, కార్మికులు చూస్తూ ఊరుకోకూడదని పిలుపు నిచ్చారు.
మోడీ విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్యాస్ ధరలపై అన్ని కాలనీల్లో నిరసనలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, పి.వెంకటరావు, ఐద్వా నాయకులు కె.లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!