Tired

Tired : అల‌సిపోతున్న మ‌హిళ‌లు.. అన్ని ఒత్తిళ్లూ ఆమె పైనే భారం!

Special Stories

Tired : మ‌గ‌వాళ్ల‌తో పాటే కెరీర్ ప్రారంభించిన మ‌హిళ‌లు ఒక‌స్థాయి త‌ర్వాత ఎందుకు వెనుక‌ప‌డి పోతున్నారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ స‌మానంగా పంచుకోవాల్సిన ఇంటి బాధ్య‌త‌లు ఎక్కువుగా స్త్రీల‌పైనే ప‌డ‌ట‌మే కార‌ణం అంటున్నాయి కొన్ని అధ్య‌యనాలు.ఉద్యోగాలు చేసే మ‌గ‌వాళ్ల‌తో పోలిస్తే ఆడ‌వాళ్లు దీర్ఘ‌కాలిక ఒత్తిడి బారిన ప‌డ‌తున్నారు. ఉద్యోగుల్లో మూడో వంతు మంది ఇదే ప‌రిస్థితిలో ఉన్నారు. అయితే ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాలు చేయ‌డంలో కూడా మ‌హిళ‌లే ముదున్నార‌ట‌.


Tired : ‘నాతో స‌మానంగా కెరీర్‌ని మొద‌లు పెట్టిన మ‌గ‌వాళ్లు వేగంగా ముందుకెళ్లిపోయారు. త్వ‌ర‌త్వ‌ర‌గా ప‌దోన్న‌తులు సాధించారు. న‌న్ను మాత్రం మా బాస్‌.. ఎప్పుడూ నిరాశ‌కు గురిచేసేవాడు. దాంతో నేనే సొంతంగా ఓ వ్యాపార సంస్థ‌ను ప్రారంభించాను. అందులో విజ‌యం సాధించాను. అయితే ఇది ఇప్ప‌టి మాట కాదు 75 ఏళ్ల నాటి మాట‌. ఇప్ప‌టికీ ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పు వ‌చ్చిన‌ట్టు నాకేం అనిపించ‌డం లేదు.’ అని హార్వ‌ర్డ్ స్కూల్లో చ‌దువుకున్న లిన్‌లేహ్ అనే మ‌హిళా వ్యాపార వేత్త ఫియ‌ర్ లెస్ విజ‌య‌న్ అనే ప్రాజెక్టు సంద‌ర్భంగా వ్య‌క్తం చేసిన అభిప్రాయాలివి. హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూళ్లో(harvard business school) మ‌హిళల‌కు ప్ర‌త్యేక అడ్మిష‌న్లు మొదలు పెట్టి యాభై ఏళ్లు కావొస్తుంది. అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టికి మ‌హిళ‌ల సంఖ్య కేవ‌లం పాతిక నుంచి 41 శాతానికే పెరిగింది అన్న ఓ అధ్య‌యానాన్ని లిన్‌లేహ్ ఉద‌హ‌రించింది.

కెరీర్‌కు సంబంధించి 60 శాతం మ‌గ‌వాళ్లు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేస్తే, ఆ శాతం మ‌హిళ‌ల్లో న‌ల‌భై నుంచి యాభై శాతం మాత్ర‌మేన‌ట‌. హార్వర్డ్(harvard) లాంటి ప్ర‌తిషాత్మ‌క విద్యాసంస్థ‌లో చదివిన వారిలోనూ కేవ‌లం 12 శాతం మాత్ర‌మే త‌మ కెరీర్‌లో పూర్తి స్థాయిలో సంతృప్తి ప‌డుతున్నార‌ట‌. అమెరిక‌న్ సోషియ‌లాజిక‌ల్ సంస్థ స‌ర్వే ప్ర‌కారం ప్ర‌తి ఉద్యోగి వారానికి క‌నీసం 50 గంట‌లు అధికారికంగా మ‌రో 10 గంట‌లు అన‌ధికారికంగా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. కానీ మ‌హిళ‌పై కుటుంబ బాధ్య‌త‌లు ఎక్కువుగా ఉండ‌టం వ‌ల్ల వృత్తికి అంత స‌మ‌యం కేటాయించలేక‌పోతున్నారట‌.

దాదాపుగా అంద‌రికీ వ్యాయామం అనేది కామ‌న్ థెర‌పీ.(therapy) ర‌న్నింగ్‌(running), వాకింగ్‌(walking), యోగ(yoga) వంటి వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల మ‌హిళ‌లు ప‌ని ప్ర‌దేశాల్లో ఒత్తిడి మోతాదును త‌గ్గించుకోగ‌లుగుతున్నారు.

వ్యాయామం(Exercise)

ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాయామం మంచి మందు. దాదాపుగా అందరికీ వ్యాయామం అనేది కామ‌న్‌థెర‌పీ. ర‌న్నింగ్‌, వాకింగ్‌, యోగ వంటి వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల మ‌హిళ‌లు ప‌ని ప్ర‌దేశాల్లో ఒత్తిడి మోతాదును త‌గ్గించుకోగ‌లుగుతున్నారు. శారీర‌క వ్యాయామాలు న‌రాల‌కు ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి. శ‌రీరాన్ని, మ‌న‌సును ప్ర‌శాంతంగా ఉంచుతాయి. దీని వ‌ల్ల ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాకుండా శ‌రీరాకృతి కూడా బాగుంటుంది.

మాట్లాడాలి (Should Speak)

మ‌న‌సుకు న‌చ్చిన ప‌నిచేస్తే మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చ‌ద‌వ‌డం, రాయ‌డం, సినిమాలు చూడ‌టం, ఫొటోలు తీయ‌డం, వండ‌టం, తోట‌ప‌ని చేయ‌డం.. ఇలా ఏదైనా కావ‌చ్చు. ఇవి చేయ‌డం వ‌ల్ల మ‌న‌సు తేలిక‌ప‌డుతుంది. న‌చ్చిన ప‌నులు చేయ‌డానికి టైం ఎక్క‌డ ఉంటుంది అంటున్నారా? ఈ మాట‌ల‌ను ప‌క్క‌న పెట్టేయాలి. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక కొద్ది స‌మ‌యాన్ని మీ కోసం కేటాయించుకుని మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని చేయాలి.

మైండ్‌సెట్ మార్చుకోవాలి(Mind set needs to change)

మైంట్ సెట్ మార్చుకుంటే మంచి భావ‌న క‌లుగుతుంది. ఆఫీసులోకి సానుకూల ధోర‌ణితో అడుగుపెట్టాలి. ఇవ్వాళ నాకు మంచి రోజు అనుకోవాలి. చేసే ప‌ని ప‌ట్ల వ్య‌తిరేక భావ‌న‌లు ఉండొద్దు. ఒక వేళ ఉన్నా తుడిచేయాలి. అలాగే మీ డెస్క్ ద‌గ్గ‌ర చేయాల్సిన ప‌నుల్ని, ముఖ్య‌మైన విష‌యాల‌ను స్టిక్ నోట్స్ రాసుకుని అతికించుకోవాలి. ఇలా చేస్తే చేయాల్సిన ప‌నులు మ‌ర్చిపోరు. ఆ త‌ర్వాత ప‌నికాలేద‌న్న ఒత్తిడికి గురికావాల్సిన ప‌రిస్థితి రాదు. సానుకూల ధోర‌ణి ఒత్తిడి దూరం చేయ‌డంలో ఎంతో సాయ‌ప‌డుతుంది.

టేక్ ఏ బ్రేక్(Take a break)

ఆడ‌వాళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తార‌నే విష‌యం తెలిసిందే. అందుక‌ని చేసే ప‌ని రొటీన్ అయిపోయి బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు త‌ప్ప‌క బ్రేక్ తీసుకోవాలి. ప‌ని చేసే మూడ్ లేద‌నిపించిన‌ప్పుడు సెల‌వు పెట్టి ఎంజాయ్ చేయాలి. తిరిగొచ్చాక రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేయ‌డం గ్యారెంటీ. చివ‌రిదే అయినా అతి ముఖ్య‌ముమైన‌ది అద్దం ముందు నిల్చొని చిరున‌వ్వు తో ప‌ల‌క‌రించుకోండి. ఈ చిరున‌వ్వు ఇచ్చే కిక్ ఎక్స్‌పీరియెన్స్ అయిన వాళ్ల‌కే తెలుస్తుంది.

అల‌స‌ట‌ను(Tired) త‌గ్గించుకోవ‌డం ఏలా?

ఎంతో బిజీగా ఉంటూ, ఎన్నో ప‌నులు చేసుకుంటూ కొంద‌రు చాలా చురుకుగా క‌నిపిస్తారు. మ‌రికొంద‌రు ఎక్కువ ప‌ని చేయ‌క‌పోయినా అల‌సిన‌ట్టు క‌నిపిస్తారు. అంతేకాదు, వంశ‌పారంప‌ర్య హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, శ‌రీర‌క కండ‌రాల్లో ఉండే కొవ్వు తీవ్ర‌త వంటివి కూడా అల‌స‌ట‌కు కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. మ‌రి ఇలాంటి కార‌ణాలు గ‌ల ఆహార నియ‌మాలు పాటించ‌డం ద్వారా అల‌స‌ట‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

  • జీర్ణ‌క్రియ స‌రిగ్గా లేక‌పోవ‌డం అల‌స‌ట‌కు ప్ర‌థ‌మ కార‌ణం. ఆహారం బాగా జీర్ణ‌మై ఒంటికి ప‌డితే మంచి శ‌క్తి వ‌స్తుంది. కాబట్టి జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుచుకునేందుకు కావాల్సిన నీటిని తాగ‌డం ఎంతో ఉత్త‌మం.
  • ప్ర‌తిరోజూ ఒక‌పూట ఆకుకూర‌ల‌ను వాడ‌టం ఎంతో మంచిది. ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుది. అంతే కాదు కొత్త‌మీర‌, అల్లం, జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో అధికంగా వాడాలి.
  • నిద్రించేందుకు ముందుగా గ్లాసుడు పాలు, అర‌టిపండు తిని ప‌డుకుంటే జీర్ణ‌క్రియ‌కు సంబంధించిన వ్యాధులు ద‌రిచేర‌వు.
  • స‌మ‌యానికి తిన‌డం చేస్తే జీర్ణ‌ ప్ర‌క్రియ సుల‌భ‌మై శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. కొవ్వుతో కూడిన ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం మానేస్తే మంచిది.
  • జంక్‌పుడ్‌ను అధికంగా తీసుకోవ‌డం మంచిది కాదు. ఈ జంక్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొల‌స్ట్రాల్ ఎక్కువుగా శ‌రీరంలో చేరుతుంది. త‌ద్వారా బ‌రువు పెరుగుతారు. అందుకే జంక్‌ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. ఇలా, అల‌స‌ట‌కు దూరంగా ఉండాలంటే ఆహారంలో స‌మ‌య‌పాల‌న‌, పండ్ల‌ర‌సాలు, ఆకుకూర‌ల‌ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం ఉత్త‌మ‌మైన మార్గం.
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *