Women techies murder case : ఫేస్బుక్లో ప్రేమించినట్టు నటించాడు..నమ్మించాడు. పెద్దలను కాదని ప్రేమవివాహం చేసుకున్నాడు. చివరకు అతి కిరాతకంగా భార్యను హత్య చేశాడు. తిరుపతిలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు ఎట్టకేలకు చిక్కుముడి వీడింది!.
Women techies murder case : తిరుపతిలో చోటు చేసుకున్న హత్యకేసు మిస్టరీ వీడింది. భార్య హత్య కేసులో భర్తే నిందితుడుగా తేలింది. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ ముద్దాయిని మీడియా ఎదుట హాజరు పర్చారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..2016లో నిందితుడు పీపుల్స్ అగైనిస్ట్ కరప్షన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నానంటూ ఫేస్బుక్ ద్వారా మృతురాలు భువనేశ్వరితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. 2018లో పెద్దలు అంగీకరించకపోవడంతో ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతి డిబిఆర్ ఆసుపత్రి రోడ్డులోని శ్రీ పద్మావతి శ్రీనివాస నిలయం అపార్ట్మెంట్ 101లో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు కరుణశ్రీ ఉంది. అయితే భార్యభర్తల మధ్య గొడవ రావడంతో జూన్ 22న తెల్లవారు జామున వారు ఉంటున్న అపార్మెంట్లో హత్య జరిగింది. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. చివరకు భర్తే హత్య చేశాడని నిర్థారణకు వచ్చారు. నిద్రపోతున్న భువనేశ్వరి మొఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం రిలయన్స్ మార్ట్‌లో సూట్ కేసును కొని అందులో భువనేశ్వరి మృతదేహాన్ని ప్యాక్ చేశాడు. తన భార్య కరోనాతో రుయా ఆసుపత్రిలో ఉందని వెంటిలేటర్ తీసుకెళ్లాలని క్యాబ్ కావాలని నమ్మించి క్యాబ్ డ్రైవర్‌తో రుయా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. రుయా ఆవరణంలోని మెడిసిన్ గోడౌన్ వెనుక సూట్ కేస్‌తో సహా పెట్రోల్ పోసి పట్టపగలే కాల్చివేశాడు. కూతురు కరుణశ్రీని తీసుకొని భార్య బంధువులకు అప్పగించి కరోనాతో భువనేశ్వరి మృతి చెందిందని నమ్మించాడు. పోలీసుల విచారణలో చివరకు దొరికిపోయాడు. నిందితుడిపై 302, 304బి, 201 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన దిండును మృతురాలిపై ఉన్న నగలను స్వాధీన పరుచుకున్నట్టు పేర్కొన్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?