Women Suicide in Gottumukkala | కంచికచర్ల: తన కూతురిని ప్రేమించానంటూ మానసికంగా వేధించటంతో పాటు కూతురికి ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన బాలిక తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కాగా తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే దానికి కారణం తనను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న యువకుడు, అతని కుటుంబ కుటుంబ సభ్యులే కారణమని ఢిల్లీలో చదువుకుంటున్న ఆ బాలిక గురువారం విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు కుటుంబ సభ్యులు(Women Suicide in Gottumukkala) చెబుతున్నారు.
మరుసటి రోజే తల్లి ఆత్మహత్య
ఫిర్యాదు చేసిన మరుసటి రోజే శుక్రవారం ఉదయం బాలిక తల్లి బండ్ల ప్రసన్న, ఆ యువకుడు చేసే వేధింపులు తాళలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవడంతో గొట్టుముక్కల గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొట్టుముక్కల గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ తిలక్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమిస్తు న్నానంటూ వేధిస్తున్నాడని బాలిక తండ్రి బండ్ల వెంకటేశ్వరయ్య తెలిపారు. దీంతో తన కూతురును ఢిల్లీలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించడం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో చదువుకుంటున్న తన కుమార్తెకు ఫోన్ల ద్వారా వేధించడంతో తన కుమార్తె గురువారం విజయవాడలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తనకు తెలిపినట్లు తండ్రికి తెలిపాడు.
తమ కుటుంబ సభ్యులపై గ్రామంలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదనతో తన కుమార్తె ఫిర్యాదు చేసిందని తండ్రి వాపోయారు. తన కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ మానసికంగా వేధించటంతో పాటు తన కుటుంబం పై దుష్ప్రచారం జరగటంతో మనోవేదనకు గురైన తల్లి ప్రసన్న ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. తన భార్య ఆత్మహత్యకు, తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్న తిలక్, అతని కుటుంబ సభ్యులు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రసన్న భర్త బండ్ల వెంకటేశ్వరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!