women safety: ప్రపంచంలో మహిళలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేశాల్లో భారత దేశం కూడా ఒకటిగా ఉన్నట్టు 2018 సంవత్సరం కాలంలో థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ ప్రకటించింది. భారత దేశంలో ముఖ్యంగా లైంగిక హింస, సంస్కృతీ సంప్రదాయలు, మహిళలు అక్రమ రవాణా లాంటి మూడు అంశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉన్నట్టు అప్పటి సర్వేలో ఈ సంస్థ తెలియజేసింది. లైంగికేతర హింస, వివక్ష హింస, వివక్ష అంశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉండగా, ఆరోగ్య పరిరక్షణలో నాలుగో స్థానంలో ఉందని తెలిపింది.

మహిళలకు, బాలికలకు రక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న అన్ని రూపాల్లోని హింస, వివక్షలను 2030 నాటికి నిర్మూలిస్తామని 2015 సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల అధినేతలు ప్రతిబ బూనారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పరిరక్షణ అమలు కాలేదు. ప్రపంచంలో మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు(women safety) తమ జీవిత కాలంలో భౌతికమైన లేదా లైంగిక మైన హింసకు గురవుతూనే ఉన్నట్టు సర్వే తెలిపింది.
బాలిక వివాహ సమస్య ఇంకా తీవ్రంగానే కొనసాగుతుందని, 18వ పుట్టిన రోజు కన్నా ముందుగానే పెళ్లిళ్లు చేస్తున్నారని సర్వే చెప్పింది. దీని వల్ల టీనేజీలోనే గర్భధారణలు అధికంగా ఉన్నాయని, దీంతో వారు విద్య, అంది వచ్చిన అవకాశాలకు దూరంగా నెట్టివేయబడుతున్నారని పేర్కొంది.
మహిళలకు ప్రమాదకరమైన దేశాలు ఎన్ని అంటే?

ఆఫ్ఘానిస్తాన్, సిరియా, సోమాలియా, ఇండియా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, కాంగో, యమెన్, నైజీరియా, అమెరికా లాంటి దేశాలు మహిళలకు ప్రమాదకర దేశాలుగా సర్వే చెప్పింది.
భారత దేశంలో ఒక ఆరు అంశాల్లో ఎక్కువుగా మహిళలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సర్వే తెలిపింది. ముందుగా లైంగిక హింస: ఇంట్లో అత్యాచారం, అపరిచితుల అత్యాచారం, అత్యాచారం కేసుల్లో న్యాయం అందుబాటులో లేకపోవడం, లైంగిక వేధింపులు, అవినీతిలో భాగంగా సెక్స్కోసం బలవంతం చేయడం.
సంస్కృతీ సంప్రదాయాలు: యాసిడ్ దాడులు, స్త్రీ జననాంగచ్చేదనం, బాలికా వివాహం, బలవంతపు పెళ్లి, రాళ్లతో కొట్టడం, భౌతిక దాడుల ద్వారా శిక్ష, బాలికాశిశు హత్య, బాలికా భ్రూణ హత్య.
మహిళల అక్రమ రవాణా: గృహ బానిసత్వం, బలవంతపు చాకిరీ, బలవంతపు పెళ్లి, లైంగిక బానిసత్వం.
లైంగికేతర హింస: సంఘర్షణ సంబంధిత హింస, గృహ హింస, భౌతిక, మానసిక హింస.
వివక్ష: ఉద్యోగంలో వివక్ష, జీవనోపాధి సంపాదించుకోలేకపోవడం, భూమి, ఆస్తి లేదా వారసత్వ హక్కుల్లో వివక్ష, విద్య అందకపోవడం, అవసరమైనంత పోషకాహారం అందకపోవడం.
ఆరోగ్య పరిరక్షణ: ప్రసవ మరణాలు, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, పునరుత్పత్తి ఆరోగ్యంపై
నియంత్రణ లేకపోవడం, హెచ్ఐవీ/ ఎయిడ్స్.

2012 సంవత్సరంలో ఢిల్లీలో ఒక బస్సులో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తర్వాత భారత దేశంలో మహిళలపై హింస పట్ల జాతీయంగా అంతర్జాతీయంగా ఆగ్రహం, నిరసనలు పెల్లుబీకినప్పటికీ దేశంలో ఇంకా అలాంటి ఘటనలు మాత్రం తగ్గడం లేదు. భారతదేశంలో అత్యాచారాల మహమ్మారి ఏటా పెరుగుతుంటే మహిళల భద్రత కల్పించటానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారని కూడా స్వచ్చంధ సంస్థ థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ అప్పుడే చెప్పింది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి