Jubilee Hills: భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
Jubilee Hills: భవనంపై నుంచి పసిపాపతో దూకి తల్లి ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 8 నెలల పాపతో కలిసి ఓ తల్లి భవనంపై నుంచి దూకేసింది. ఈ ఘటనలో తల్లి చనిపోగా ఆ పసిపాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఎస్ఐ కన్నెబోయిన ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన భీమల్ కుమార్, ఆర్తి భార్యభర్తలు. వీరికి 8 నెలల పాప ఉంది. కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇక్కడే పనిచేసుకుంటూ జూబ్లీహిల్స్‌లో ని ఓ ఇంట్లో అద్దెకు నివశిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కూడా భీమల్ కుమార్, ఆర్తి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ పెద్దదవ్వడంతో భార్యపై భర్త చేయిచేసుకున్నాడు.
తన 8 నెలల కూతురుతో కలిసి వారు నివసిస్తున్న భవనం రెండో అంతస్తు నుంచి ఆర్తి దూకేసింది. తీవ్ర గాయాలపాలైన తల్లీకూతుళ్లను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి కన్నుమూసింది. ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త భీమల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ఇది చదవండి:మొట్ట మొదటి సారి మెట్రోలో గుండె తరలింపు!
ఇది చదవండి: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లాసిక్) పాలసీ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి: టిడిపి నేత పట్టాభిపై కారుదాడి, గాయాలు
ఇది చదవండి: అచ్చెన్నాయుడు అరెస్టు | నిమ్మాడలో ఉద్రిక్తత
ఇది చదవండి: సర్వీస్ పర్సన్స్ గోడు వినాలి: ఎఐటియుసి
ఇది చదవండి: పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో