Woman arrested: పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తూ బంగారం, డబ్బులతో పారిపోతున్న ఓ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈమె వలలో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు పెద్ద ఎత్తున్న మోసపోయారు.
Woman arrested: చిత్తూరు: తొలి పరిచయంలో అనాథను అని అంటోంది. తనకెవ్వరూ లేరు అంటూ ధీన మొఖం పెడుతుంది. ఆ తర్వాత ప్రేమ వలపు వలను విసురుతోంది. ఇక అంతే ఆమె వలలో పడిన వారిని తాళి కట్టు అంటోంది. ఈ తంతు జరిగిన తర్వాత అసలు వ్యవహారంలోకి ఎంటర్ అవుతుంది. మెల్లగా డబ్బులు, నగదు తీసుకోవడం ప్రారంభించి ఊడాయిస్తోంది. ఇలా పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన ఈ నిత్య పెళ్లి కూతురును ఎట్టకేలకు చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు.
సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన వివరాల పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా విజయపురం మండలం నాగరాజకండ్రిగకు చెందిన సునీల్ కుమార్ (29) మార్కెటింగ్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాగే తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివసిస్తున్నాడు. అయితే సునీల్‌కు ఏడీబీ ఫైనాన్స్‌లో పనిచేసే సుహాసినితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పెద్దల సమక్షంలో గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. సుహాసిని తాను అనాథను అని చెప్పడంతో సునీల్ కుమార్ తల్లిదండ్రులు 20 గ్రాముల బంగారం కానుకగా ఇచ్చారు.
ఆ తర్వాత ఆమె మాయ మాటలు చెప్పి సునీల్ తండ్రి వద్ద రూ.2 లక్షలు తీసుకుంది. అలాగే బంధువుల వద్ద కూడా అప్పు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సునీల్ సుహాసిని నిలదీయడంతో గొడవ జరిగింది. అనంతరం ఈ ఏడాది జూన్ 8న ఏమీ తెలియనట్టు ఇంట్లో నుంచి నెమ్మదిగా జారుకుంది.
భార్య కనిపించకపోవడంతో కంగారు పడిన సునీల్ ఆమె వస్తువులు అన్నీ వెతక్కగా ఆధార్ కార్డు లభించింది. ఆ ఆధార్ కార్డు ఆధారంగా విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది. అలాగే ఏడాది క్రితం వినయ్ అనే మరో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుని ఇలాగే మోసం చేసిందని తెలుసుకున్నాడు. దీంతో సునీల్ కుమార్ జూన్ 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు
ఫిర్యాదు అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక గాలింపు చేపట్టారు. నిత్య పెళ్లి కూతురు సుహాసిని కోసం గాలిస్తుండగా తిరుపతి స్విమ్స్ వద్ద వివేకానంద సర్కిల్ వద్ద సుహాసిని ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. మరో వైపు రెండేళ్ల క్రితం తనను కూడా ఇలాగే సుహాసిని పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని రెండో భర్త కొత్తగూడెంకు చెందిన వినయ్ ఓ వీడియో ప్రకటన విడుదల చేశాడు. తనతో పెళ్లి జరిగిన తర్వాత రూ.15 లక్షలు తీసుకుందని ఆరోపించాడు. తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పటి సీఐ ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇంట్లో నగదు, బంగారం తీసుకుని సుహాసిని పారిపోయిందన్నాడు.
తనకు 2018లో సుహాసిని అనాథగా పరిచయమైందని, ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో 2019 మే 22న ప్రేమ వివాహం చేసుకున్నట్టు వినయ్ తెలిపాడు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర నుంచి రూ.10 లక్షలు తీసుకుందని తెలిపాడు. అయితే రెండు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడం గమనించానన్నాడు. అంతకు ముందే సుహాసిని తన మేనమామ అంటూ నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాళేనికి చెందిన మొదటి భర్తని తనకు పరియం చేసిందన్నాడు. తన ఇద్దరు పిల్లలనే మేనత్త పిల్లలని నమ్మించిందని ఆ వీడియోలో తెలిపాడు.
ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో..
ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆరా తీయ్యగా తనకు మేనమామగా పరిచయం చేసిన వ్యక్తే సుహాసిని భర్త అని, ఆ పిల్లలు వారికే పుట్టినట్టు తెలిసిందన్నాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదన్నారు. ఆ మరుసటి రోజే ఆమె తన ఇంట్లో నుంచి వెళ్లిపోయిం దన్నారు. పోలీసులు పట్టించుకోక పోవడంతో తనను ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ఆమె ఉండేదని బాధితుడు, రెండో భర్త వినయ్ ఆ వీడియోలో తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు నిత్య పెళ్లి కూతురును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆమె బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!