Winter Season: మెల్లగా చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఒక పక్క కరోనాతో యుద్ధం చేస్తున్న మనకు చలికాలం అంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలో చలికాలంలో పెద్దలు నుంచి పిల్లలు వరకూ అందరూ జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కాలంలో ప్రశాంతంగా ఉండగలుగుతాం. చలికాలం(Winter Season)లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్ధాం.


చలికాలంలో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువుగా తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస వంటి పండ్లు, ఖర్జూరా ఎక్కువుగా తీసుకోవాలి. రోజూ ఏదొక వేళ శరీరానికి చెమటలు పట్టేలా చూడాలి. అందుకు ప్రతి రోజూ నడవడం గాని తప్పకుండా వ్యాయామం చేయడం గాని చేయాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్కును ధరించాలి. చర్మం పొడిగా ఉన్నవారు మాయిశ్చరైజర్ కోల్డ్ క్రీముతో మర్థన చేసుకోవాలి.
ప్రతి రోజూ స్నానానికి వాడే సబ్బులలో సున్నం శాతం ఎక్కువుగా ఉండే విధంగా చూసుకోవాలి. అదే విధంగా స్నానానికి మరీ చన్నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. కూల్ డ్రింక్స్ , ఫాస్ట్ ఫుడ్లు తీసుకోవడం తగ్గించాలి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శీతాకాలంలో చర్మం పొడిబారిపోకుండా రక్షణ పొందుతుంది.
చలికాలంలో ఎక్కువుగా దాహం అనిపించదు. అలా మంచినీళ్లు తాగకుండా ఉంటే మెదడులోని హిస్టామిన్లు అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచినీళ్లు తరుచుగా తాగుతూ ఉండాలి.


చర్మంపై సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. దీంతో మలినాలు బయటకు పోయి కాంతివంతంగా చర్మం కనిపిస్తుంది. చర్మాన్ని ప్రతి రోజూ కొబ్బరి నూనెతో మర్ధన చేస్తూ ఉంటే పగుళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. పెదవులు పగళ్లు సమస్య ఉన్నవాళ్లు తప్పకుండా వెన్న, నూనెతో ఉదయం, సాయంత్రం వేళల్లో 10 నిమిషాలు పాటు మసాజ్ చేసుకోవాలి.
రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గి అరికాళ్లు చల్లబడి నిద్రకు భంగం కలుగుతుంది. అలాంటప్పుడు సాక్సులు ధరించి పడుకుంటే అలాంటి ఇబ్బంది నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు ఎక్కువ పొరలు ఉన్న దుస్తులు ధరించాలి. ఇన్ఫెక్షన్లకు గురికాకుండా సి విటమిన్ పండ్లను ప్రతి రోజూ తీసుకోవాలి. ఒకే రోజు ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం మానేయాలి. రోజులో రెండు సార్లు కడిగితే సరిపోతుంది.
పొంచి ఉన్న కరోనా ముప్పు
కరోనా తీవ్రత ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ రానున్న రోజుల్లో మరింత ముప్పు ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ తో పాటు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కరోనా విషయంలో ముఖ్యంగా చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. ఇతరులకు వ్యాపించే అవకాశం కూడా ఎక్కువుగానే ఉంది. అందుకే సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి. బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఇతరులకు దూరంగా ఉండాలి.


పిల్లలు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
చలికాలంలో పిల్లల్లో ఆకలి మందగిస్తుంది. అలాంటప్పడు వారు చిరుతిళ్లపై ఆసక్తి చూపుతుంటారు. వాటి పట్ల పిల్లల్ని దూరంగా ఉంచాలి. తిండి తగ్గిపోవడం వల్ల వారి శరీరంలో కూడా శక్తి సన్నగిల్లుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గి రోగాలు పిల్లలపై దాడి చేసే అవకాశం ఉంది. చలికాలంలో తేమశాతం ఎక్కువుగా ఉంటుంది. కాబట్టి రకరకాల వైరస్లక, బ్యాక్టీరియాకు స్థారమనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పిల్లల్లో శ్వాస ద్వారా చలిగాలులతో పాటు వైరస్, బాక్టీరియా కూడా వచ్చి చేరుతాయి. పిల్లల్ని ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి పడేటట్టు చూడాలి. భోజనం వేడి వేడిగా ఉండటంతో పాటు తాజాగా ఉండేలా చూడాలి. ఫ్రిజ్లో పెట్టిన పదార్థాలు వేడి చేసి అస్సలకి ఇవ్వవద్దు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!