ఉప్పును ఎందుకు చేతికి అందివ్వ‌రు? | Why not give salt from one hand to another?

ఉప్పును ఎందుకు చేతికి అందివ్వ‌రు? | Why not give salt from one hand to another?

salt : మ‌న గృహాల్లో వాడే ఉప్పును చాలా ప్రాధాన్య‌త ఉన్న‌ది. ‘అన్ని వేసి చూడు..న‌న్నువేసి చూడు‘ అంటూ కూర‌ల‌కు సంబంధించిన ఓ సామెత మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఉప్పు లేనిది వండిన ఏ కూరా అంత రుచిక‌రంగా ఉండ‌దు. ఎంత మంచి కూర అయిన‌ప్ప‌టికీ ఎన్ని దినుసులు వేసిన‌ప్ప‌టికీ ఆ కూర‌లో చివ‌ర‌గా ఉప్పు వేయ‌క‌పోతే బ‌హుశా ఎవ్వ‌రూ తిన‌రు. అందుక‌నే ఉప్పును ప్ర‌తి కూర‌లోనూ వేస్తుంటారు. ఉప్పు ఆరోగ్యానికి కూడా మంచి ప్ర‌యోజ‌ న‌క‌ర‌మైన ల‌వ‌ణం. అయితే ఈ ఉప్పును సాధార‌ణంగా మ‌న ఇళ్ల‌లో ఎవ్వ‌రూ చేతికి అందించి ఇవ్వ‌రు. ఇది ఒక ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. అయితే ఉప్పు(salt)ను ఎందుకు చేతికి అందించి ఇవ్వ‌రో కొన్ని వివ‌రాల‌ను తెలుసుకుందాం!

ఉప్పు సాధార‌ణంగా చేతికి ఇవ్వ‌రు. ఒక వేళ ఇస్తే ఆ ఇద్ద‌రి మ‌నుషుల మ‌ధ్య‌లో గొడ‌వ‌లు వ‌స్తాయ‌ని ఎప్ప‌టినుంచో ఉన్న న‌మ్మ‌కం. అస‌లు ఇందులో ఎంత నిజం దాగుంది?
శ్లో. గో భూ తిల హిర‌ణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ‌
రౌప్యం ల‌వ‌ణ మిత్యాహుర్ధ‌శ‌దానాః ప్ర‌కీర్తితాః

అంటే ఉప్పు ద‌శ‌దానాల్లో ఒక‌టి. పితృ కార్యాల‌లో, శ‌ని దానాల‌లో ఉప్పు దానం ఇవ్వ‌డం ఆచారమ‌ట‌. అందుక‌ని అశుభాన్ని గుర్తు చేసే విష‌యం క‌నుక ఉప్పును చేతికి ఇవ్వ‌కూడ‌ద‌ని పెద్ద‌వారు అంటుంటారు. అంతే కాదండోయ్‌. ఉప్పందించ‌డం అంటే ఒక‌రి ద‌గ్గ‌రి ర‌హ‌స్య స‌మాచారాన్ని వారిని మోసం చేసి మ‌రొక‌రికి చెప్ప‌డం అని అర్థం కూడా వ‌స్తుంద‌ట‌.

సాల్ట్ థెరపీ గ‌దిలో మ‌హిళ చికిత్స దృశ్యం

సైంటిఫిక్ కార‌ణం ఏమైనా ఉందా?

ఉప్పు(salt)ను ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో కూడా వాడారు.ప్ర‌స్తుతం ప్రాశ్చాత్య దేశాల్లో ఉప్పు థెర‌పీ కూడా చేస్తున్నారు. ఉప్పు నీటిలో కొద్దిసేపు కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తుంటారు. వాస్త‌వానికి స‌ముద్రం స్నానం అన్నింటికంటే ఉత్త‌మ స్నాన‌మ‌ట‌. ధ్యానంలో అధిక వేడి వ‌ల్ల క‌లిగిన ఫ్రీరాడిక‌ల్స్ ను త‌గ్గించ‌డానికి ఉప్పునీటిని వాడుతుంటారు. నిజంగా ఉప్పుకు అంత‌శ‌క్తి ఉందా? అని మీరు అనుకుంటే ఓ ప్ర‌యోగం చేయండి. మీరు ఎక్కువుగా ఒత్తిడికి గురైన‌ప్పుడు గోరువెచ్చ‌ని నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేసి అందులో మీ అరికాళ్లు మునిగేలా ఉంచి ప‌ది నిమిషాలు కూర్చోండి. త‌ర్వాత నీటిని పార‌పోయండి. అనంత‌రం శుభ్రంగా కాళ్ల‌ను స‌బ్బుతో క‌డ‌గండి. దీని వ‌ల్ల మ‌న‌లో ఉన్న ఒత్తిడి(స్ట్రెస్‌) త‌గ్గిపోతుంద‌ని ఇది చేసిన వారు చెబుతున్నారు. వాస్త‌వానికి ఉప్పును నెగిటివ్ ఎన‌ర్జీని తీయ‌డానికి ఉప‌యోగిస్తార‌ట‌. అందుక‌నే ఒక‌రి చేతి నుండి మ‌రొక‌రి చేతికి ఉప్పు అందించ‌రేమో!.

Share link

Leave a Comment