Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
Myanmar Capital : ఆ నగరంలోకి అడుగు పెట్టగానే అత్యద్భుతంగా తీర్చిదిద్దిన విలాసవంతమైన 20 వరుసల రహదారులు, 100కు పైగా విలాసవంతమైన హోటళ్లు, వేగవంతమైన వైఫై సేవలు, షాపింగ్ మాల్స్ వంటివి అన్నీ స్వాగతం పలుకుతాయి. కానీ అక్కడ లేనిదల్ల జనాలే. అదే మయన్మార్ రాజధాని నెపిడా(Naypyitaw). 15ఏళ్ల క్రితం వరి పొలాలు, చెరుకు తోటలన్నీ తొలగించి దాదాపు రూ.26,000 కోట్లు ఖర్చు పెట్టి అధ్యునికంగా నిర్మించిన ఈ నెపిడా నగరం, ఇప్పటికీ జనాల కోసం ఎదురుచూస్తూనే ఉంది. విస్తీర్ణంలో చూసుకుంటే లండన్ నగరం కంటే నాలుగు రెట్టింపులు ఉన్న ఆ మహా నగరంలో జనాభా మాత్రం 8 లక్షలకు మించి ఉండరు. నెపిడా అంటే అక్కడ భాషలో రాజు సింహాసనం అని అర్థం. అక్కడ ట్రాఫిక్ జామ్‌లు, జనాల రద్దీ, రణగొన ధ్వనులు ఏమీ కనిపించవు. అందుకే అక్కడి వారంతా దానికి దెయ్యాల నగరంగా పిలుస్తారు. ప్రభుత్వం పక్కా వ్యూహంతో ఎన్నో ఏళ్లు క్రితం నిర్మించిన ఈ నగరం పరిస్థితి ఇప్పుడు ఇలా ఎందుకు మారింది?.


దెయ్యాల నగరంగా పేరు ఎందుకు వచ్చింది?
గతంలోని మయన్మార్(Myanmar)కు రాజధానిగా యంగ్యాంగ్((Yangang) ఉండేది. అయితే 2వ ఇరాక్ యుద్ధానికి ముందు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న తమ దేశ రాజధానిపై విదేశీ దళాలు సులువుగా దాడికి పాల్పడే అవకాశం ఉందని మయన్మార్ ఆర్మీ అధికారులు భావించారు.దీంతో అక్కడకు దూరంగా మరో కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించారు. అయితే నగరం నిర్మాణం పూర్తియి దాదాపు 15 ఏళ్లు గడిచింది. 2006 సంవత్సరం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడ నుంచే జరుగుతున్నాయి. మంత్రిత్వశాఖ భవనాలు, పార్లమెంట్, సుప్రీంకోర్టు లాంటివన్నీ అక్కడే ఉన్నాయి. కానీ సామాన్య జనం మాత్రం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఏమాత్రమూ ఆసక్తి చూపించడం లేదు.


ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ!
విదేశీ రాయభారాల కార్యాలయాలు సైతం యంగ్యాంగ్(Yangang) నుంచి ఈ రాజధానికి వచ్చేందుకు విముఖత చూపుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి సైతం మయన్మార్ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లను, ప్రయత్నాలు చేసింది. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో మిలటరీ మ్యూజియం, జైన్ మ్యూజియం(Jain Museum), పగోడా(Pagoda) దేవాలయం, సఫారీ పార్క్(Safari Park), జూ పార్క్ లాంటివి నిర్మించింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొన్న రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి విమానాలు, హెలికాఫ్టర్లను సందర్శకులకు అందుబాటులో ఉంచింది. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పర్యాటకుల నుంచి ఆశించినంతగా స్పందన లభించడం లేదు. 100 గదులు ఉన్న విలాసవంతమైన హోటళ్లో కూడా నాలుగైదు కుటుంబాలకు మించి కనిపించడం లేదని చాలా మంది పర్యాటకులు చెబుతున్నారు. ఇప్పటికీ దేశ ఆర్థిక రాజధానిగా యంగ్యాంగే కొనసాగుతుంది.


జనాలు లేకపోవడానికి కారణం ఏమిటి?
మయన్మార్ దేశంలో మిలటరీ రాజ్యం పోయినప్పటికీ, కఠిన నిబంధనలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. అక్కడ చట్టాలను మాత్రం అతిక్రమిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదా- అనుమతి లేకుండా నగరంలోని కొన్ని ఫొటోలు తీశారని జర్నలిస్టులను జైళ్లో వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకేనేమో బయట వారు అక్కడ నివాసం ఏర్పరుచుకోవాడానికి ఆసక్తి చూపడం లేదు. అసలు నెపిడా అనే రాజధానిని నిర్మిస్తున్నామని అక్కడ ప్రజలకు మయన్మార్ ప్రభుత్వం చెప్పలేదు. 2006 సంవత్సరంలో ఉన్నపళంగా దాన్ని దేశరాజధానిగా ప్రకటించింది. అధికార యంత్రంగం అంతా అక్కడకు తరలిపోవాలని ఆదేశించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని హంగులతో ఆ నగరాన్ని నిర్మించినట్టు ప్రభుత్వం తెలిపింది.


15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం!
కానీ అప్పటికప్పుడు తమతమ వూళ్లను వదిలేసి కొత్త నగరానికి వెళ్లడానికి అక్కడ ప్రజలకు సాధ్యం కాలేదు. వారి అవసరాలకు సరిపడ స్కూళ్లు, ఆసుపత్రులు అక్కడ అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు మాత్రం వారి కుటుంబాలను సొంత గ్రామాల్లోనే ఉంచి వారు మాత్రమే నెపిడాలో ఉంటున్నారు. మరికొందరు ఉద్యోగులు రోజూ రాజధాని నెపిడాకు సొంతూరుకు ప్రయాణం చేస్తూ ఉండేవారు. జనాలు ఎక్కువుగా లేకపోవడంతో హోటళ్లు, ఆసుపత్రులాంటివి నిర్మించిన వారు కూడా సరైన సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. మరో ప్రక్క అక్కడ సదుపాయాలు లేకపోవడతో ప్రజలు అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి మయన్మార్ చాలా పేద దేశం. ఉన్న ప్రాంతాన్ని వదిలేసి కొత్త ప్రాంతానికి వెళ్లడం కూడా ప్రజలకు ఆర్థిక భారంలా కనిపించింది. దాంతో ఏళ్లు గడుస్తున్నప్పటికీ అక్కడ జనాభా మాత్రం పెరగలేదు. ఎక్కువుగా ప్రభుత్వ ఉద్యోగులు, దౌత్య సిబ్బంది, పర్యాటకులే అక్కడ కనిపిస్తారు. వారిలో కూడా నగరానికి ప్రతిరోజూ వచ్చి వెళ్లే వారే తప్ప శాశ్వతంగా మాత్రం నివాసముంటు న్నవారు చాలా తక్కువ. భవిష్యత్తులో ఆ నగరం ముఖచిత్రం మారుతుందని మయన్మార్ ప్రభుత్వం దాదాపు 15 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది. అలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రాజధానికి మాత్రం దెయ్యాల నగరం అనే పేరు మాత్రమే మిగిలింది.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం