Indians study Medicine in Ukraine | ఉక్రెయిన్‌పై ఇంకా రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ 20 శాతంపైగా భూభాగం రష్యా చేతిలోకి వెళ్లింది. మొన్నటి వరకు దాడులు పరిశ్రమలపైన, ఎయిర్పోర్టులపైన దాడులు చేసిన రష్యా సైన్యం తాజాగా రెండ్రోజుల కిందట నుంచి జనావాసాలపైన కూడా దాడికి పాల్పడిన విషయం అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు బంకర్లలో ఉండి తమని రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన మోడీ సర్కార్ ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించింది.
భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ ఎందుకు వెళ్తారు?
ఉక్రెయిన్‌లో మెడిసిన్ (Indians study Medicine in Ukraine)చదవడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపారు. ఎంతో మంది వేల సంఖ్యలో విద్యార్థులు భారత్ నుండి ఉక్రెయిన్‌కు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. ఉక్రెయిన్ విద్యా మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 20,000 వేల కంటే ఎక్కువ మంది భారతీయులు ఉక్రెయిన్‌లో ఉన్నట్టు ఆ ప్రభుత్వం చెబుతుంది. వారిలో దాదాపు 18,000 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న 76 వేల మంది విదేశీ విద్యార్థుల్లో మనవారే అతిపెద్ద గ్రూపుగా ఉన్నారట. మెడికల్ విద్యకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ కొంత మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఇంజనీరింగ్ కోర్సులు కూడా చేస్తున్నారు.
ఇండియాలో ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు పొందలేని విద్యార్థులు, ప్రైవేటు కాలేజీలు వసూలు చేసే ఫీజులను చెల్లించలేని వారు ఉక్రెయిన్‌లో మెడిసన్ చదవడానికి ఇష్టపడతారు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదవడానికి ఆరేళ్లలో ఫీజు సగటున రూ.15-22 లక్షలు వరకు అవుతుంది. అదే ఇండియాలోని ప్రైవేటు కాలేజీల్లో చదవాలంటే రూ.60 లక్షల నుంచి రూ.1.1 కోట్లు అవుతాయి.

ఉక్రెయిన్‌లో వైద్య విద్య
భారత దేశంలో మెడికల్ సీటు పొందడానికి NEET పరీక్షను అధిక మార్కులతో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అలా పరీక్షను క్లియర్ చేస్తేనే ప్రభుత్వం లేదా ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ సీట్లు పొందుతారు. ఉక్రెయిన్‌లో MBBS కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి విద్యార్థులు NEET క్వాలిపై అయితే చాలు. అధిక మార్కులు రావాల్సిన అవసరం లేదు. ఇండియాలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు కంట్లే NEET పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ.
ఉక్రెయిన్‌లో సంపాదించిన డిగ్రీ సర్టిఫికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ మెడికల్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ సహా పలు సంస్థలు ఈ డిగ్రీని గుర్తిస్తాయి. ఉక్రెయిన్‌లో ప్రతి మెడికల్ యూనివర్శటీకి MCI, WHO, UNESCO గుర్తింపు ఉన్నాయి. మెడిసిన్ రంగంలోని అత్యధిక గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్లు కల్గిన ఉక్రెయిన్ యూరప్‌లో నాల్గో స్థానంలో ఉంది.
శాశ్వత పౌరసత్వం లభించే అవకాశం
మెడిసిన్ చదివే విద్యార్థులు చదువు పూర్తైన తర్వాత యూరఫ్‌లో శాశ్వత నివాసం, స్థిర నివాసం కోసం కూడా చూస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్‌లో వసతి సౌకర్యం, ఆహారం ఇతర సౌకర్యాలు సహా మొత్తం జీవన వ్యయం చాలా తక్కువలో పూర్తవుతుంది. విద్యార్థులు విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలతో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ప్రాక్టీస్ చేయడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్ (FMGE) రాయాల్సి ఉంటుంది.
ఉక్రెయిన్‌లో విద్యార్థులకు అంతర్జాతీయ నాణ్యతతో కూడిన బోధన లభిస్తుంది. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు ఆ మెడిసిన్ డిగ్రీకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ఉక్రెయిన్‌లోని మెడికల్ యూనివర్శిటీల్లో అడ్మిషన్ పొందేందుకు ఎలాంటి ఎంట్రన్స్ పరీక్షలు ఉండవు. ఇంగ్లీష్‌లోనే బోధన ఉంటుంది. అందు వల్ల కొత్తగా విదేశీ భాషను నేర్చుకోవాల్సిన అవసరం లేదు.

మెడిసిన్ చదివేందుకు భారతీయులు ఎంపిక చేసుకునే దేశాలు – విదేశాల్లో చదువుకుంటున్న భారతీయులు
ఉక్రెయిన్ – 18,000
రష్యా – 16,500
యుఎస్ఎ – 2,11,930
యుఎఇ – 2,19,000
కెనడా – 2,15,720
ఆస్ట్రేలియా – 92,383.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!