Sparrow : పిచ్ఛుకలకు చేసిన అన్యాయం ఊరికేపోలేదు!
Sparrow : ఈ భూ మండలంలో పిచ్చుకలు ఎదుర్కొన్నటువంటి దారుణమైన పరిస్థితులను బహుశా ఏ జీవి అనుభవించలేదేమో!. వాస్తవానికి జీవితంలో ఎదురయ్యే సర్వసాధారమైన విపత్తుల నుండి ఈ భూమ్మీద ఏ జీవి తప్పించుకోలేదు. ఈ క్రమంలోనే 1958 వ సంవత్సరంలో చైనా దేశంలో పిచ్చుకలపై దండయాత్ర మొదలైంది. అప్పుడు చైనాలో వేటాడబడినంతగా ప్రపంచంలో పక్షులు వేటాడబడినట్టు ఎక్కడా దాఖలాలు లేవు.

పిచ్చుక(Sparrow)లపై పగబట్టిన చైనా!
అప్పట్లో చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పారిశ్రామిక ఉత్పత్తిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు రూపించింది ప్రభుత్వం. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా త్వరగా అభివృద్ధి దిశలోకి అడుగు పెట్టాలనుకున్న చైనా దేశం ఆధునికతను రూపుదిద్దుకోనేందుకు ఉద్యమాన్ని చేపట్టింది.అయితే అప్పటిదాకా చైనా వ్యవసాయాధారిత సమాజమే. అయితే ఈ ఉద్యమంలో భాగంగా 5000 కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం అన్నది ఒక ముఖ్యాంశం. దీని వల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యింది. ఈ మొదటి విజయంతో తర్వాత సంవత్సారినిక మరింత పెద్ద లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది. కానీ చైనాకు వాతావారణం సహకరించలేదు. కొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ తగిన ఫలితాలను సాధించలేక పోయామనే భయంతో ప్రభుత్వం వ్యవసాయాధికారులు దిగుబడిని ఎక్కువుగా లెక్కగట్టారు. ఈ తప్పుడు లెక్కలు ఆ దేశ ప్రజల అవసరాలకు ఆహార సరఫరాకు మధ్యగల సమతుల్యతపై తీవ్రంగా పడింది. గిడ్డంకులు నుండి తప్పించుకోవడానికి అధికారులు తమ తప్పిదాన్ని పిచ్చుకలపైకి నెట్టారు.

లక్షల సంఖ్యలో పిచ్చుకలు హతం!
గిడ్డంగుల నుండి ఏడాది కాలంలో ఒక పిచ్చుక(Sparrow) సుమారుగా 1.8 కిలోల ధాన్యపు గింజలు తిన్నదని అందువల్ల ఆహార కొరత ఏర్పడిందని ప్రకటించారు. ఆఖరికి పిచ్చుకలపై నేరాన్ని మోపారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలందర్నీ పిచ్చుకలపై యుద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రజలంతా వలలు పన్ని పెద్ద సంఖ్యలో పిచ్చుకలను పట్టుకుని చంపడం మొదలు పెట్టారు. ఇందుకు విష ప్రయోగం చేశారు. తుపాకులతో కాల్చేశారు. అవి అలసట విసుగుతో ఎగరలేక కిందపడి చనిపోయే వరకూ డప్పులు వాయిస్తూ శబ్ధాలు చేశారు. గూళ్లను నాశనం చేశారు. గుడ్లను పగలగొట్టారు. చివరకు పిచ్చుక పిల్లలను కూడా వదలకుండా చంపేశారు.
ప్రభుత్వం చంపిన పిచ్చుకల సంఖ్య ఆధారంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు బహుమానాలను గుర్తింపును ఇచ్చింది. తర్వాత కొంత మంది శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకల జీర్ణ వ్యవస్థ లోని పదార్థాలను పరిశీలించారు. దానిలో మూడు వంతులు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు ఉండగా ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్టు కనుగొన్నారు. పిచ్చుకలు మానవులకు ఎంతో ఉపయోగం కలిగించే పక్షులని వారి పరిశోధనల ద్వారా నిర్థారణకు వచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం చైనా చవిచూసింది. పిచ్చుకలను నాశనం చేసే ప్రయత్నాల వల్ల పంట దిగుబడి పెరగకపోగా మరింతగా తగ్గిపోయింది.

తీవ్రమైన కరువు, నష్టం!
అసలు నిజం తెలుసుకున్న తర్వాత పిచ్చుకలను చంపే ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ఆపేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిడతలను తినే పిచ్చుకలు లేకపోవడంతో పంటలపై మిడతల దాడి ఎక్కువయ్యింది. దానితో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడయ్యాయి. అతిపెద్ద కరువుకు దారి తీశాయి. మిడతలను చంపడానికి కీటక నాశనులను పెద్ద మొత్తంలో వినియోగించడంతో నేల నాణ్యత క్షీణించిపోయింది. పొలాల్లో పనిచేయాల్సిన రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో వేల సంఖ్యలో గ్రామాలను వదిలి పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్లారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!