WHO Warning There are Four New Viruses | WHO: మరో నాలుగు కొత్త వైరస్ లుNewDelhi: 2020లో కరోనాతో సహజీవనం చేసిన ప్రపంచానికి 2021లో కూడా వైరస్లు బెడద పోయేటట్టు లేదు. కరోనాని అంతం చేసేందుకు వ్యాక్సిన్లు సిద్ధమై ప్రజల వద్దకు వస్తున్నాయి. ఇదే సమయంలో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబ్ పేల్చింది. యూకే కొత్త స్ట్రెయిన్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే, మరో 4 కొత్త రకం వైరస్‌లను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2019 నవంబర్ నెలలో తొలిసారి చైనాలోని కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సంగతి అందిరికీ తెలిసిన విషయమే. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ లో ఇప్పటికి మొత్తం 4 రకాల వైరస్లు ప్రపంచం అంతటా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది.
ఒకదానికి ఒకటి సంబంధం లేదు
గత ఏడాది జనవరిలో డీ614 జీ జన్యూ మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాగా అది జూన్ 2020 నాటికి విజృంభించి అత్యధిక శాతం కేసులు నమోదు కావడానికి కారణమైంది. ఆగష్టు, సెప్టెంబర్ నెలలో మూడు స్ట్రెయిన్ వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ స్ట్రెయిన్‌కు సైంటిస్టులు క్లస్టర్ -5 గా నామకరణం చేశారు. తాజాగా 2020, డిసెంబర్ నెలలో బ్రిటన్ మరో కరోనా స్ట్రెయిన్ ను గుర్తించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా వైరస్‌తో ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదని సైంటిస్టులు గుర్తించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అందిన నివేదికల ఆధారంగానే డబ్ల్యూహెచ్ ఓ 4 వైరస్లు ఉన్నట్టు నిర్థారించినట్టు తెలుస్తోంది.


భారత దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 25 గంటల్లో 18,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965 కు చేరుకుంది. ఇందులో 2,47,220 యాక్టివ్ కేసులు ఉండగా, 99,27,310 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి 217 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,49,435కి పెరిగింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.39 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 96.16 శాతానికి రికవరీ రేటు చేరిందని కేంద్రం తెలిపింది.
ఇది చదవండి : మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై ఆగ్రహం!