Sanitizer: కరోనా భయంతో ఇప్పుడు ప్రపంచమంతా సబ్బులు, శానిటైర్లతో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే సూక్ష్మక్రిములను చంపడానికి శానిటైజర్(Sanitizer) వాడాలని మొట్టమొదటి చెప్పింది ఎవరో తెలుసా?
ఆస్ట్రియాలోని వియన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన (1946) ఇగ్నజ్ ఫిలిప్ సెమ్మెల్వీస్(ignaz phlipp semmelweis) అనే డాక్టర్ ఈ శానిటైజర్‌ను కనుగొన్నారట. వియన్నా ఆసుపత్రిలో రెండు ప్రసూతి వార్డులుండేవి. ఒక దాంట్లో పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు మరో వార్డులో నర్సులు, ఆయాలు సేవలు అందించేవారు.


ఆసుపత్రిలో ప్రసూతి సమయంలో చాలా మంది గర్భిణులు మరణించేవారు. వారిని రక్షించాలనే పట్టుదలతో సంబంధిత కారణాలపై డాక్టర్ ఇగ్నజ్ అన్వేషించారు. పురుష వైద్యులున్న వార్డులో మరణాల సంఖ్య ఎక్కువుగా, నర్సులున్న వార్డుల్లో తక్కువుగా ఉండటాన్ని గమనించారు.
అసలు ఇలా ఎందుకు జరుగుతుందని..మరింత లోతుగా దీనిపై పరిశోధన చేయగా మరో భయంకరమైన విషయం వెల్లడైందట. పురుష వైద్యులు ఆసుపత్రిని ఆనుకునే ఉండే శవాగారంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేవారు.
అప్పుడు వారి చేతులకు రక్తపు మరకలు, ఇతర సూక్ష్మజీవులు అంటుకునేవి. వైద్యులు నేరుగా ప్రసూతి వార్డులోకి వచ్చి పురుడు పోస్తుండటంతో సూక్ష్మజీవుల కారణంగా గర్భిణులకు ఇన్ ఫెక్షన్ అవుతూ మృతి చెందేవారట.


మరో వార్డులోని నర్సులు పోస్టుమార్టం, ఆపరేషన్లు లాంటివి చేయరు. దీంతో అక్కడ గర్భిణులకు ఇన్ఫెక్షన్ బెడద తప్పి, మరణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. ఈ విషయాన్ని ఇగ్నజ్ నిర్థారించుకున్న తర్వాత ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు నాంది పలికారు.
ఆపరేషన్ చేసే ముందు వైద్యులు చేతులను క్లోరిన్ ద్రావణంతో శుభ్రంగా కడగాలని నిబంధన పెట్టారు. పక్కాగా అమలయ్యేలా చూడటంతో ఆసుపత్రిలో మరణాలు క్రమంగా తగ్గుతూ రెండేళ్లలో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆయన చేసిన కృషి కాలక్రమంలో ప్రజలకు చేరింది. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో శానిటైజర్ల వాడకం జీవిన శైలిలో ఒక భాగంగా మారింది.
ఎంత మోతాదులో శానిటైజర్ వాడాలంటే?
ప్రస్తుతం మనం శానిటైజర్‌ను అరచేయి, మణికట్టు, వేళ్లు, గోళ్లు ఇలా అన్ని భాగాలకు సరిపడేలా సమానంగా పరుచుకునేలా శానిటైజర్‌ను రాసుకోవాలి. ముందుగా అరచేయి నిండా శానిటైజర్ వేసుకొని దాన్ని రెండు చేతులతో రుద్దుకుంటూ చేతుల భాగాలన్నింటికి విస్తరించేలా రాసుకోవాలి. శానిటైజర్ పూర్తిగా ఆరిపోయేంత వరకు రుద్దుతూనే ఉండాలి. ఇలా రాసుకునే ప్రక్రియ 20-30 సెకన్ల సమయం పడుతుంది.


శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇది ఆరోగ్య సమస్యలను సృష్టించదు. దీన్ని ఎవరైనా సురక్షితంగా రాసుకోవచ్చు. శానిటైజర్ రాసుకున్నప్పుడు ఇందులో ఉన్న కొద్ది శాతం ఆల్కహాల్ మాత్రమే మన చర్మంలోకి ఇంకుతుంది. శానిటైజర్ల వల్ల చర్మ సంబంధిత అలర్జీలు రావడం చాలా అరుదు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!