white paper | అనగనగా ఓ తండ్రి చాలా నిరుపేద. అతడు రోడ్డు మీద చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఉన్న జీవితంలో ఆనందంగా గడిపే కుటుంబం వారిది. ప్రతి రోజూ చెత్త కాగితాలు ఏరుకుంటూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు.
కొడుకు 1వ తరగతి చదువుతున్నాడు. ఒక రోజు ఆ తండ్రి చిత్తు కాగితాలు ఏరుకుంటుండగా ఒక అందమైన తెల్ల కాగితం(white paper) కనిపించింది. ఎందుకో దానిని చూడగానే తన కొడుకు గుర్తుకు వచ్చాడు. ఆ తెల్ల కాగితాన్ని చాలా భద్రంగా దాచి మిగిలిన కాగితాలను అమ్మాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రి ఆ White కాగితాన్ని జేబులో నుంచి తీసి కొడుక్కు ఇస్తాడు.
white paper : తండ్రి ఇచ్చిన కాగితం
తన కొడుకు చాలా తెలివైన వాడు. చాలా శ్రద్ధగా చదువుతాడు. తండ్రి ఇచ్చిన కాగితాన్ని ఏదో అక్షరాలతో నింపేశాడు. కొడుకు నిద్ర పోయిన తర్వాత తెల్లారిన తర్వాత కొడుకు రాసిన కాగితాన్ని చూసి మురిసిపోతాడు ఆ తండ్రి. కొడుక్కు తెలియకుండా ఆ కాగితాన్ని చాలా భద్రంగా తన ఇంట్లో దాస్తాడు.
ఇలా ప్రతి రోజూ ఆ తండ్రి చిత్తుకాగితాలు ఏరే సమయంలో మంచి కాగితాలు ఉంటే వాటిని వేరు చేసి ఇంటికి తీసుకొచ్చేవాడు. కొడుకు ఆ papersను తన చదువులో భాగంగా రాసుకునేవాడు. అలా కొన్నాళ్లు గడిచింది. కొడుకు పెద్దవాడు అవుతున్నాడు.
చదువుపై ఆసక్తి ఉన్న ఆ కొడుక్కు ప్రతి క్లాసులోనూ First క్లాస్ వచ్చేవాడు. ఇలా స్కూల్ చదువు ముగిసింది. కొడుక్కు కావాల్సిన వస్తువులు, చదువుకు కావాల్సిన అన్ని వస్తువులు తండ్రి ఉన్న డబ్బులతో సర్ధుపాటు చేసేవాడు. కాలేజీలో అడుగు పెట్టిన కొడుకు అక్కడ కూడా తన ప్రతిభను చాటుతున్నాడు. ఏ నాడూ నాన్న నాకు అది కావాలి.
ఇది కావాలి? అంటూ మారం చేసేవాడు కాదు. తన తండ్రి తన కోసం పడుతున్న బాధను, కష్టాన్ని తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక ప్రక్క గమనిస్తూ మదిలోనే ఉంచుకున్నాడు. ఎలాగైనా మంచిగా చదివి ఉద్యోగం సంపాదించి తన తండ్రిని, తల్లిని మంచిగా చూసుకోవాలనే ఆలోచన చేస్తుండేవాడు.
ఇలా రోజులు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. కొడుకు పెద్ద చదువులకు సుదూర ప్రాంతం వెళ్లాడు. ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా తన చదువును మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు ఆ కుర్రాడు. కృషి, పట్టుదలతో, తన కుటుంబ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని అనుకునేవాడు. తన కష్టానికి కూడా దేవుడు ఒక మంచి మార్గం చూపించాడు.
ఆ కొడుకు తెలివితేటలకు, ప్రతిభకు IAS ఉద్యోగం వచ్చింది. తాను ఉద్యోగం చేసేది కూడా తన జిల్లా పరిధిలోనే కావడంతో మరింత సంతోషం వ్యక్తం చేశాడు. ఉద్యోగం వచ్చిన సమయంలో ఒక సన్మాన కార్యక్రమం ఆ కొడుక్కి జరిగింది. అప్పుడు ఆ కొడుకు ప్రసంగిస్తూ తన తండ్రి చిత్తు కాగితాలు ఏరుకొని నన్ను, నా తల్లిని పోషించేవాడని, తాను పేదరికం ఈ స్థాయికి వచ్చానని చెబుతాడు.
తన తండ్రికి చదువు గురించి తెలియకపోయినా తన చదువు కోసం తన తండ్రి ఎన్నో కష్టాలు పడ్డాడని చెబుతాడు. నేను ఇంతటి ఉన్నత స్థాయిలో, స్థానంలో ఉన్నానంటే తన తండ్రి ఇచ్చిన తెల్లటి కాగితాలే తొలి ఆయుధాలు అని గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు తన తండ్రి చిత్తు కాగితాలతో పాటు తెల్లకాగితాలు దొరికితే వాటిని నాకు ఇచ్చాడని, వాటి మీద నేను రాసుకునేవాడనని ఉద్వేగ భరితంగా చెబుతాడు.
ఇంతటి ఘనత మొదటిగా నా తండ్రికే చెల్లుతుందని, నా తండ్రే మొదటి గురువు, దైవం అని చెబుతాడు. ఇంతలో సభలో ఎక్కడో చివరన కూర్చొన్న తన తండ్రిని ప్రసంగంలోనే గమనిస్తాడు. నా తండ్రి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. నాన్న ఒక్కసారి ఇక్కడకు రండి! అని పిలుస్తాడు. భయం భయంగా తన తండ్రి ఉద్వేగంతో నిండిన గుండెతో కలెక్టర్ అయిన కొడుక్కు ఎదురుపడతాడు.
ఆ సమయంలో తండ్రి కొడుకులు ఒకరిని నొకరు కన్నీరు కారుస్తూ కౌగిలించుకుంటారు. ఇంతలో ఆ తండ్రి జేబులో నుంచి కొన్ని కాగితాలు తీసి కొడుక్కు ఇస్తాడు. ఆ కాగితాలు తన కొడుక్కు మొట్టమొదటిగా Tella kagithalu గా ఇచ్చినవే. వాటిపైన తన కొడుక్కు రాయగా, వాటిన ఆ తండ్రి చాలా భద్రంగా ఇన్ని సంవత్సరాలు దాచి కలెక్టర్ అయిన తర్వాత తన కొడుకు ముందు చూపిస్తాడు.
వాటిని చూసిన కొడుకు మరింత ఉద్వేగ భరిత ఆనంద భాష్పాలతో వాటిని పరిశీలిస్తాడు. ఒక white paper విలువ ఆ తండ్రికి తెలిసింది కొంత వరికే. కానీ ఆ తెల్లకాగితాన్ని ఎలా వాడాలో మాత్రం తెలిపింది మాత్రం ఆ కన్న కొడుకు. తండ్రి ఇచ్చిన ఆ కాగితాలపైనే తన తొలి సంతకం పెట్టి తండ్రి చేతిలో పెడతాడు.
జీవితంలో ప్రతి తండ్రి తన పిల్లల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలనే చూస్తాడు. తనకు చదువు లేకపోయినా, తన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని ఆలోచిస్తారు. పిల్లల చదవుకు ఎన్ని లక్షలు అయినా దారపోస్తారు. ఎంతటి కష్టానైనా భరిస్తారు. ఈ కథలో తండ్రి కూడా అలా ఆలోచించే ఇచ్చాడేమో! కానీ దానిని ఎలా వినియోగించుకోవాలో మాత్రం ఆ కొడుకు తెలుసుకొని తన జీవితాన్ని, తన పూర్వ కుటుంబ జీవితాన్ని మార్చాడు. ఇది వాస్తవ కథ కాదు. కేవలం కల్పితం మాత్రమే. మీకు నచ్చుతుందని ఆశిస్తూ..! ఖమ్మం మీకోసం.