bones strong చాలా మంది అవసరమైనవి తినకుండా నోటికి రుచిగా ఉండే నూడుల్స్, చాక్లెట్లు, పఫ్ ఇలా ఏవో కొన్ని పదార్థాలు పైపైన తింటుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కాల్షియం చాలా ఎక్కువగా లభిస్తేనే ఆ పైన వివాహం అయిన తర్వాత, బిడ్డలకు తల్లి అయిన తర్వాత ప్రసవ సమయం లోనూ, ఇంటి పని, ఆఫీసు పని చక్కబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.


మన దేశంలో 40 శాతానికి పైగా ఆడపిల్లలు కాల్షియం (bones strong)లోపంతో బాధపడుతున్నారు. తగినంత కాల్షియం ఉంటేనే ఎముకల పటిష్టత బాగుటుంది. ఇవి సప్లిమెంటరీగా మందుల ద్వారా కాకుండా వారు తినే ఆహార పదార్థాల నుండే సమకూర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఎముకలను రక్షించే కాల్షియం, జింక్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
మధ్య వయస్సు మహిళల్లో పెలుసుగా ఉండే ఎముకలకు జింక్ చాలా అవసరం. మాంసాహారు లైతే జింక్ సమృద్ధిగా లభించే గొర్రెమాంసం తీసుకోవచ్చు. ఇక శాఖాహారులైతే ఆకుకూరలు, తమలపాకుల్లో కూడా జింక్ అధికశాతం ఉంటుంది. తోటకూరలో పుష్కలంగా విటమిన్ – కె ఉంటుంది.ఇది శరీరంలోని ఎముకలకు అవసరమైన కాల్షియంను సరఫరా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది.
అలాగే ఎముకలలోకి ఖనిజ లవణాలు చేరడం వల్ల జీర్ణక్రియకూ తోడ్పడుతుంది. విటమిన్ – కె ఆస్ట్రియోఫోరోసిస్ వ్యాధి ఉన్నవారిలో ఎముకలలో ఖనిజ లవణాల ప్రమాదాలు పెరగడానికి దోహదం చేయడమే గాక ఎముకలు చిట్లిపోవడం తగ్గుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.


ఆహార పదార్థాలలో ఉప్పును తగ్గించాలి. ఉప్పు ఎక్కువుగా తీసుకుంటే మూత్రం ద్వారా కాల్షియంను బయటకు పంపించి వేస్తుంది. అందుకే ఉప్పును తక్కువుగా తీసుకోవాలి. తోటకూర, బచ్చలికూర, పొన్నగంటికూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలు, పాలు ఇంకా ఇతర ఉత్పత్తులను ఎక్కువుగా తీసుకోవడం ద్వారా కాల్షియం తగినంత సమకూరి ఎముకలు దృఢంగా ఉంటాయి.
తేనీరుతో ఎముకలు బలిష్టం!
తేనీటిని ఆస్వాదించేందుకు మరో మంచి కారణం దొరికింది. తేనీరు తాగడం ద్వారా ఎముకలు బలిష్టంగా మారతాయనీ, తుంటి సహా ఎముకలు విరిగే ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు మూడు కప్పుల తేనీటితో ఆస్టియోపొరోసిస్తో ఎముకలు విరిగే ప్రమాదం 30 శాతం దాకా తగ్గుతుంద ని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు.ఈ అధ్యయనంలో భాగంగా సగటున 80 ఏళ్ల వయసున్న 1200 మంది వృద్ధ మహిళలను పదేళ్లపాటు పరిశీలించారు.


కనీసం రోజుకు మూడు కప్పుల తేనీరు తాగిన వారిలో ఎముకలు విరిగే ముప్పు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. ఫ్లేవనాయిడ్స్ వంటి వృక్షరసాయనాలు కొత్త ఎముక కణాల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు, ప్రస్తుత కణాల క్షీణతను నెమ్మదింపజేయడం ద్వారా ఎముకల్ని బలిష్టంగా మారుతుండ వచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం వృద్ధుల్లో కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!