When is holi 2022 : ఈ ఏడాది సరదా హోలీ వచ్చేసింది. సయ్యాటల సంబురం తెచ్చినట్టుంది. బంధువులు, స్నేహితుల మధ్య ఆనందాలను పెంచే హోలీ (holi) ప్రతీ ఒక్కరి జీవితంలో మరుపురాని జ్ఞాపకాలను మిగుల్చుతోంది. చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఎంతో సంబురంగా జరుపుకునే పండగే హోలీ.
చెడుపై మంచి జయించినందుకు చిహ్నంగా రంగులు చల్లకుంటూ ఈ పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆనందాల హోలీ 2022, మార్చి 18న దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. జీవితం రంగులమయం కావాలని కోరుతూ ప్రజలు సంబురాల్లో మునిగి తేలేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా లంబాడీ తాండాల్లో వేడుకల హడావిడి మొదలైంది.
When is holi 2022 : పండుగ నేపథ్యం
హోలీ పర్వదినం..అది జరుపుకోవడం దాని ఆవవ్యక్తపై పురాణ గాధలు ఇలా చెబుతున్నాయి. పార్వతీ పరమేశ్వరులను ఒకటి చేయాలని తలపెట్టిన దేవతలు వారిద్దరి కల్యాణం కోసం మన్మధుడి సహాయం కోరుతారు. సకల దేవతల కోరికలను మన్నించిన మన్మధుడు శివుడిపై పూల బాణాలు వేస్తాడు.
మన్మథుడి చర్యలకు ఆగ్రహించిన శివుడు మన్మథుడిని తన చిత్రకన్నుతో కాల్చి భస్మం చేస్తాడు. అందుకు సంకేతమే కామదహనం. మన్మధుడి భార్య రతి దేవి శివుని వద్దకు వచ్చి తన భర్తను తిరిగి ప్రసాదించమని వేడుకోగా, మన్మథుడుని పరమ శివుడు బతికిస్తాడు.


ఆ రోజున కాముని పున్నమిగా, మరుసటి రోజును హోలీ పండుగగా జరుపుకుంటారు. బాలకృష్ణుడు పూతన అనే రాక్షసి ప్రాణాలు హరించిన రోజు అని కూడా పూర్వికులు చెబుతున్నారు. అందుకు సంకేతంగా గోపికలు వసంతోత్సవంగా హోలీ పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. మరో గాధ ఏమిటంటే..రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మ వరంతో విష్ణుమూర్తి మీద కోపంతో హద్దులు మరిచి, దేవతలను, మునులను అనేక రకాలుగా హింస్తాడు.
హిరణ్యశిపుడి సోదరి మోలిక పెద్ద మాయావి. ఆమె మంటల్లో తగులబడకుండా ఉండే శక్తి కలిగి ఉంటుంది. హరినామం విడువని ప్రహ్లాదుడ్ని హోలిక చేతుల్లో ఉంచి అగ్నికి ఆహుతి చేయాలనుకుంటాడు హిరణ్యకశిపుడు. నారాయణ జపంతో ప్రహ్లాదుడు బతికి హోలికనే దహించుకపోతుంది.
దుష్టత్వంపై సాధుతత్వం సాధించిన విజయానికి గుర్తుగా ప్రజల హోలీని ఆరంభించారు. పసుపు నీళ్ళు, చందనం, కసూర్తి పరిమళాలు, పుష్ఫ లేపనాలు కలిపిన నీళ్ళు ఆనందంగా ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. కాలక్రమేణా రంగుల వినియోగం అమల్లోకి వచ్చింది. హోలీ రోజు రంగులు చల్లుకుంటే సంవత్సరమంతా ఆనందంగా సాగుతుందని విశ్వాసం.


స్నానం జరభద్రం
హోలీ పండుగ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంతో ఆనందంగా ఉంటామో, అదే ఆనందాన్ని కుటుంబాలకు దూరం చేయవద్దు. నదులు, చెరువులు, వ్యవసాయ బావుల వద్దకు స్నానానికి వెళ్లే వారు ఈత వస్తే తప్ప నీటిలోకి వెళ్లవద్దు. ఈత రానివారు ఒడ్డునే ఉండి స్నానం చేయాలి. వీలైంతన వరకు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దు.
When is holi : తాగిన మైకంలో స్నానం చేయాలన్న ఆశతో నీళ్ళలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మనకు తెలియని ప్రదేశాల్లో స్నానానికి వెళ్లడంతో అక్కడ ఎంత లోతు ఉందన్న విషయం తెలియక, ఆ లోతులో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనకు తెలిసిన దగ్గరి ప్రాంతానికి మాత్రమే స్నానానికి వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకుని, పండుగ పూట విషాదం లేకుండా ప్రతి ఒక్కరూ పాడుపడాలి.