WheatGrass juice: సేంద్రియ పదార్థాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. తీసుకునే ఆహార పదార్థాల నుండి సౌందర్య సాధనాల వరకు అన్నింటిలో మొక్కలు, సేంద్రియ సంబంధ పదార్థాలు ఉన్నవాటికే పెద్దపీట వేస్తున్నారు ఆరోగ్య ప్రియులు. సేంద్రియ ఆహార పదార్థాలలో ఒకటి గోధుమ గడ్డి. గోధుమ గడ్డి(WheatGrass juice)లో ఎన్నో విశేష గుణాలున్నాయి. ఇప్పుటు వాటి గురించి తెలుసుకుందాం!.
గోధుమ గడ్డి వల్ల లాభాలు!
గోధుమ గడ్డి(WheatGrass juice)ని సూపర్ ఫుడ్‌గా కూడా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గోధుమ గడ్డి మనకు పొడి రూపంలో కానీ, Juice రూపంలో కానీ దొరుకుతుంది. గోధుమ గడ్డిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఒక ట్రేలో మట్టి పోసి, అందులో గోధములను మొలకెత్తించాలి. గోధుమ గడ్డి పెరగడానికి 10 నుండి 12 రోజులు పడుతుంది. ఆకులు పైకి వచ్చి పెరిగిన తర్వాత కత్తెరలో ఆకులను కత్తిరిస్తే, దానిపైనే మళ్లీ ఆకులు పెరుగుతాయి. మూడు సార్లు వరకు కోత కోసుకోవచ్చు. అలా కోసిన Grass తో రసం తీసుకుని తాగాలి. అయితే మొదటిసారి ఉన్నంత తీపి తర్వాత సారి ఉండకపోవచ్చు. ఈ గోధుమ గడ్డినే ఎండబెట్టి పొడి, మాత్రల రూపంలో తయారు చేస్తారు.
గోధుమ గడ్డి(WheatGrass juice)లో ప్రోటీన్లు, పొటాషియం, పీచు పదార్థం. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె. థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ బీసీ పాంటోథెనిక్ యాసిడ్, ఇనుము, జింక్, కాపర్ మాంగనీస్, సెలీనియమ్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ ఆకు పచ్చటి తాజా రసాన్ని పొద్దున వ్యాయామం తర్వాత తాగాలి. ఇది తాగితే కలిగే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. Iron లోపంతో ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుంది. అల్సర్ ఉన్న వారికి చికిత్సగా పని చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.


ఇంతకీ నిపుణులు ఏమని అంటున్నారంటే, ఈ రసం తీసుకునే మోతాదు విషయంలో జాగ్రత్త వహించాలి. ఇందులో Potassium మోతాదు ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని సీరమ్ పొటాషియం అత్యధిక స్థాయిలో ఉన్నవారికి ఇవ్వకూడదు. చాలా తక్కువ మోతాదులో భోజనానికి 20 నిమిషాల ముందు తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే తల తిరగడం, వాంతులు అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం మీద మన శరీరం ఎంత అయితే తీసుకోగలదో అంత మాత్రమే తీసుకోవాలి.